After meals: భోజనం చేశాక వీటిని తిన్నారంటే ఏదైనా పొట్టలో అరిగిపోవాల్సిందే, ఎలాంటి గ్యాస్ సమస్యలు రావు-if you eat these after meals you should get rid of any stomach problems and you wont have any gas problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  After Meals: భోజనం చేశాక వీటిని తిన్నారంటే ఏదైనా పొట్టలో అరిగిపోవాల్సిందే, ఎలాంటి గ్యాస్ సమస్యలు రావు

After meals: భోజనం చేశాక వీటిని తిన్నారంటే ఏదైనా పొట్టలో అరిగిపోవాల్సిందే, ఎలాంటి గ్యాస్ సమస్యలు రావు

Haritha Chappa HT Telugu
Sep 21, 2024 09:30 AM IST

After meals: మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం చేశాక కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

భోజనం తినాల్సిన పదార్థాలు
భోజనం తినాల్సిన పదార్థాలు (Pixabay)

After meals: భోజనం తర్వాత పొట్ట ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి రావడం వంటివి కొందరిలో జరుగుతూ ఉంటాయి. ఇవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ వాటిని భరించడం ఒక్కోసారి కష్టంగా మారుతుంది. ప్రతిసారీ మందులు, ఈనో, సిరప్‌లు వేసుకోవడం చికాకుగా అనిపిస్తుంది. మీరు ఏం తిన్నా కూడా అది ప్రశాంతంగా అరిగిపోవాలన్నా, జీర్ణ క్రియ సవ్యంగా సాగాలన్నా కొన్ని ఆహారాలను తినడం అలవాటు చేసుకోండి. భోజనం చేశాక వీటిని తింటే మీ పొట్టలో ఉన్న ఆహారాన్ని అరిగించేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లను, సమ్మేళనాలను విడుదలయ్యేలా చేసి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆహార అణువులను విచ్చిన్నం చేయడంలో, పోషకాలను శరీరం గ్రహించేలా చేయడంలో కొన్ని రకాల ఆహారాలు ఉత్తమంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి.

స్పైసీ ఫుడ్

నూనెతో నిండిన ఆహారాలు, స్పైసీ ఫుడ్ తింటే పొట్టలో వికారంగా అనిపిస్తుంది. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పొట్టలో నొప్పి కూడా వస్తుంది. అలాంటప్పుడు చిన్న పచ్చి అల్లం ముక్కను తినండి. లేదా పచ్చి అల్లాన్ని నీటిలో వేసి ఆ నీటిని మరిగించి ఆ నీటిని తాగండి. ఇది పొట్టలో ఉన్న సౌకర్యాన్ని వెంటనే పోగోడుతుంది. జీర్ణ క్రియను ప్రేరేపించి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. భారీ భోజనాలు చేశాక చిన్న పచ్చి అల్లం ముక్కను తినడం ఎంతో మంచిది. లేదా ఇలా అల్లం కషాయాన్ని తాగినా ఉత్తమమే.

బొప్పాయి

బొప్పాయిలో జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసే లక్షణాలు ఉంటాయి. దీనిలో పపైన్ అని పిలిచే సమ్మేళనం ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పేగులు ఆరోగ్యాన్ని కాపాడతాయి. తాజా బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొట్ట నిండుగా ఆహారాన్ని తిన్నాక ఇబ్బందిగా అనిపిస్తే బొప్పాయిని తినేందుకు ప్రయత్నించండి.

పైనాపిల్

పైనాపిల్ పేరు చెప్తేనే నోరూరిపోతుంది. దాని వాసన తినాలన్న కోరికను పెంచేస్తాయి. భోజనం చేశాక ఒక పైనాపిల్ ముక్కను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బ్రోమెలైన్... ఇది జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్. భోజనం తర్వాత పైనాపిల్ ముక్కలను తింటే శరీరం పోషకాల శోషణ కూడా మెరుగుపరుచుకుంటుంది.

పెరుగు

భోజనం పూర్తి చేశాక చివరలో ఒక కప్పు పెరుగన్నం తినేందుకు ప్రయత్నించండి లేదా ఉత్తి పెరుగుతుందా మంచిదే ఇది పొట్ట సౌకర్యాన్ని తగ్గిస్తుంది తెలుగులో ప్రోబయోటిక్ అధికంగా ఉంటాయి. ఇవి పేరు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మంచి బాక్టీరియాతో నిండిన పెరుగులు భోజనం తర్వాత తింటే పొట్ట ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రావు

సోంపు గింజలు

భోజనం పూర్తి చేశాక గుప్పెడు సోంపు గింజలు నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. ప్రాచీన కాలం నుంచి ఇది అందరికీ తెలిసిన పద్ధతే. కానీ వీటిని తినేవారి సంఖ్య చాలా తక్కువ. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ రెడీగా ఉంటాయి. కాబట్టి కొన్ని తీసుకొని తింటారు. కానీ ఇంట్లో మాత్రం సోంపు గింజలను తినేవారు అతి తక్కువ మంది. భోజనం తర్వాత ఒక టీ స్పూన్ సోంపు గింజలు తింటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ఆపిల్ సెడర్ వెనిగర్ కూడా మితంగా తీసుకుంటే మనకు ఎంతో సహాయం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సెడర్ వెనిగర్‌ను గ్లాస్ నీటిలో వేసి బాగా కలపాలి. భోజనం చేశాక ఆ గ్లాస్ నీటిని మెల్లగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గుతుంది. ఆహారం విచ్ఛిన్నమై జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌ను కొని ఇంట్లో పెట్టుకోండి. ఇది 70 శాతం చేదుగానే ఉంటుంది. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి జీర్ణం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి భోజనం చేశాక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినేందుకు ప్రయత్నించండి.

ఆహారంలో పుదీనాను కలుపుకొని తిన్నా మంచిదే, జీర్ణ కోశ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణాశయాంతర పేగు కండరాలను విశ్రాంతి తీసుకునేలా చేయడంలో పుదీనా ముందుంటుంది. కాబట్టి భారీ భోజనాలు పూర్తి చేసాక పుదీనా టీని తాగేందుకు ప్రయత్నించండి. లేదా పుదీనా ఆకులను నమిలినా కూడా ఎంతో మంచిది.

Whats_app_banner