Winter Soup: చలికాలంలో ఈ సూప్ తాగితే బరువు పెరగరు, పైగా చర్మం మెరుస్తుంది
Winter Soup: చలికాలంలో త్వరగా బరువు పెరిగిపోతారు. చర్మం కూడా పొడి బారిపోయి అందవిహీనంగా కనిపిస్తుంది. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే పాయ సూప్ శరీరంలో వెచ్చదనాన్ని కాపాడుతూ జలుబు నుంచి కాపాడుతుంది.
చలికాలం ప్రారంభం కాగానే మనసు స్పైసీగా, వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా అనిపించగానే ఎక్కువ మంది జంక్ ఫుడ్ తిని ఆ కోరికను చల్లార్చుకుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చలికాలంలో స్పెషల్ గా తినాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో పాయ సూప్ కూడా ఒకటి. ఇది వింటర్ స్పెషల్ వంటకం అని చెప్పుకోవచ్చు. ఇది రుచిగా ఉండటమే కాదు స్పైసీగా ఏదైనా తినాలన్న మీ కోరికను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యానికి, అందానికి అనేక ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే పాయ సూప్ శరీరంలో వెచ్చదనాన్ని కాపాడడంతో పాటు జలుబు, ఊబకాయాన్ని దూరం చేస్తుంది. పాయ సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పాయ సూప్ లో ఉండే పోషకాలు
పాయ సూప్ లో మినరల్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫ్లోరైడ్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు. ఇవి మనలో పోషకాహారలోపం రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి చలికాలంలో వారానికి ఒకసారైనా పాయా సూప్ తాగేందుకు ప్రయత్నించండి. పాయ సూప్ ను చపాతీ, రోటీలకు జతగా కూడా తినవచ్చు. ఈ కాంబినేషన్ అదిరిపోతుంది.
బరువు తగ్గడం
ఈ సూప్ లో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే జెలటిన్ అనే సమ్మేళం ఉంటుంది. ఈ సూప్ తాగడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పాయ సూప్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పాయా సూప్ తాగడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేన్ తగ్గుతుంది. ఎముకలు ఉడకబెట్టిన ఈ పులుసులో ఉన్న అమైనో ఆమ్లాలు మంటను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది కాకుండా, ఇందులోని ఎల్-గ్లూటామైన్ పేగు మంటను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. కాబట్టి పొట్ట ఆరోగ్యానికి కూడా పాయా సూప్ ఎంతో మేలు చేస్తుంది.
పాయా సూప్ అంటే గొర్రెకాళ్లతో చేసే సూప్. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో అవసరం. ముప్పయ్యేళ్లు దాటిన మహిళలు తప్పకుండా పాయా సూప్ తాగుతూ ఉండాలి. అలాగే ముసలివారిలో ఎముక క్షీణిస్తుంది. వారు కూడా ఎముక త్వరగా విరగకుండా ఉండేందుకు మటన్ పాయా సూప్ తాగాల్సిన అవసరం ఉంది. గొర్రె లేదా మేక కాళ్లలో కాల్షియం, కాపర్, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఇవి మనకు అత్యవసరమైనవి. అలాగే పాయా సూప్ తాగడం వల్ల వైరస్, బ్యాక్టిరియాలో పోరాడే శక్తి కూడా శరీరానికి వస్తుంది.చలికాలంలో మీరు పాయా సూప్ తరచూ తాగడం వల్ల వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు వంటివి రావు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం