Bellyfat reducing drink: రాత్రి నిద్రపోయే ముందు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం-if you drink this drink before going to sleep at night it is sure to melt belly fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellyfat Reducing Drink: రాత్రి నిద్రపోయే ముందు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం

Bellyfat reducing drink: రాత్రి నిద్రపోయే ముందు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం

Haritha Chappa HT Telugu

Bellyfat reducing drink: రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పానీయం జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది, బరువును తగ్గిస్తుంది.

బెల్లీ ఫ్యాట్ డ్రింక్ (shutterstock)

పొట్ట చుట్టూ కొవ్వు చేరడం అనేది ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. ఆడా, మగా ఇద్దరిలో బెల్లీ ఫ్యాట్ సమస్యా అధికంగా ఉంది. ఎంత వ్యాయామం చేసినా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గదు. ఇలా పొట్ట దగ్గర కొవ్వు చేరడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవక్రియ నెమ్మదిగా సాగడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటివన్నీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ఇలా బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మంచి పద్ధతి కాదు. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి నిద్రపోయే ముందు ఒక పానీయాన్ని తాగడం వల్ల ఆ కొవ్వు కరిగే అవకాశం ఉంది. కనీసం రెండు నెలల పాటూ ఈ డ్రింకు తాగి చూడండి…. బెల్లీ ఫ్యాట్ కరగడాన్ని మీరే గుర్తిస్తారు.

సోంపు నీరు

సోంపు నీళ్లు పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తుంది. ఇది మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ఈ సోంపు నీళ్లలో సెలెరీని (Celery) కూడా వేసి తాగాలి. సోంపు, సెలెరీ… ఈ రెండింటినీ పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు. సెలెరీ శరీరంలో పొట్ట ఉబ్బరం, శరీరంలో నీరు చేరిపోవడం వంటి సమస్యను తొలగిస్తుంది. సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి తయారుచేసిన డ్రింక్ ను రాత్రి పడుకునే ముందు తాగితే బెల్లీ ఫ్యాట్ పై చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపుతుంది. కొన్ని రోజులకే పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది.

కొత్తిమీర నీరు

కొత్తిమీర మిక్సీలో వేసి రుబ్బుకుని, అందులో గ్లాసుడు నీళ్లు వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా రాత్రి పూట గ్లాసు కొత్తిమీర నీరు తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే జీర్ణక్రియను నియంత్రిస్తుంది. బరువు నియంత్రణకు కొత్తిమీర నీరు మంచి ఆప్షన్.

పసుపు

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. పానీయంలో చిటికెడు పసుపును వేసుకుని తాగడం వల్ల తీపి తినాలన్న కోరికలు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ కరిపోతుంది.

డ్రింక్ తయారీ ఇలా

బెల్లీఫ్యాట్ ను కరిగించే పానీయాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకని రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉంటే మంచిది. ఒక గ్లాసు నీటిని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇందులో ఒక స్పూన్ కొత్తిమీర తరుగు, ఒక స్పూన్ సెలెరీ తరుగు, సోంపు, పావు టీస్పూన్ పసుపు వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద మరిగించాలి. ఈ నీరు సగానికి అయ్యేవరకు మరిగించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి… వేడివేడిగా దీన్ని తాగాలి. రాత్రి పడుకోబోయే ముందు తాగితే ఈ పానీయం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ డ్రింకును కొన్ని నెలల పాటూ తాగడం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. బెల్లీఫ్యాట్ కరగడం ప్రారంభమవుతుంది. ఈ పానీయం శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.