Alzheimers: వామ్మో ఆ పానీయం రోజూ తాగితే మతిమరుపు వ్యాధి వచ్చేస్తుందట, జాగ్రత్తగా ఉండండి-if you drink that drink daily you will get amnesia be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alzheimers: వామ్మో ఆ పానీయం రోజూ తాగితే మతిమరుపు వ్యాధి వచ్చేస్తుందట, జాగ్రత్తగా ఉండండి

Alzheimers: వామ్మో ఆ పానీయం రోజూ తాగితే మతిమరుపు వ్యాధి వచ్చేస్తుందట, జాగ్రత్తగా ఉండండి

Haritha Chappa HT Telugu
Jan 06, 2025 07:30 AM IST

Alzheimers: వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమందికి మతిమరుపు వ్యాధి రావడం సహజమే. కానీ కొంతమంది చిన్న వయసులోనే విషయాలు మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిరోజూ మీకు వైన్ తాగే అలవాటు ఉంటే మతిమరుపు వచ్చే వ్యాధి త్వరగా వచ్చేస్తుందట.

మతిమరుపు వ్యాధి ఎందుకు వస్తుంది?
మతిమరుపు వ్యాధి ఎందుకు వస్తుంది?

ఆల్కహాల్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. అన్నింటినీ ఇష్టంగా తాగే వారి సంఖ్య ఎంతో మంది. వైన్ కూడా ఆల్కహాల్ లో ఒక రకం. దీన్ని ప్రతిరోజూ తాగేవారు ఎంతో మంది. నిజానికి ఇలాంటి ఆల్కహాల్ వంటివి బ్రెయిన్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.

yearly horoscope entry point

స్క్రిప్స్ రీసెర్చ్ అల్జీమర్స్ వ్యాధి, ఆల్కహాల్ మధ్య ఆసక్తికరమైన సంబంధాన్ని ఆవిష్కరించింది. అధిక మద్యపానం వల్ల బ్రెయిన్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుపుకోవడానికి ప్రయత్నించారు.

అల్జీమర్స్ ప్రభావం

అల్జీమర్స్ వ్యాధి చిత్తవైకల్యానికి ప్రధాన కారణం. ఇది దాదాపు 7 మిలియన్ల అమెరికన్లను ప్రభావితం చేస్తుంది. ఈ సంఖ్య 2060 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి కోట్లలో ఉంటుంది. వృద్ధాప్యం, జన్యు పరంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే మద్యం సేవించడం వంటి జీవనశైలి కారకాలు కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉన్నట్టు ఈ కొత్త అధ్యయనం తేల్చింది.

రోగనిరోధక ప్రతిస్పందన: అల్జీమర్స్ వ్యాధి, ఆల్కహాల్ వాడకం… రెండూ తాపజనక జన్యువులలో, ముఖ్యంగా మైక్రోగ్లియా (మెదడులోని రోగనిరోధక కణాలు), వాస్కులర్ కణాలలో అధికంగా ప్రభావాన్ని చూపించినట్టు గుర్తించారు. దీని వల్ల మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఆల్కహాల్ వంటి హానికరమైన పదార్థాలు మెదడు పనితీరును ప్రభావితం చేయడానికి అనుమతిస్తుంది. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ అవసరం. అవి దెబ్బ తింటే మెదడు పనితీరు మారిపోతుంది.

కొంతమంది ప్రతిరోజూ ఆరోగ్యానికి మంచిదని రెడ్ వైన్ తాగుతూ ఉంటారు. రోజూ రాత్రి రెడ్ వైన్ తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇలా రెడ్ వైన్ తాగే వారిలో చర్మంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి చర్మంలో మెరుపు కనిపిస్తుంది. అందుకని రెడ్ వైన్ తాగే వారి సంఖ్య పెరిగింది. అయితే రెడ్ వైన్ ప్రతిరోజూ తాగే వారిలో కూడా అల్జీమర్స్ వ్యాధి వస్తున్నట్టు తేలింది. ఇలాంటి ఆల్కహాల్ వాడకం అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాన్ని వేగవంతం చేస్తుంది.

ఆహారం, పానీయాలు తాగేటప్పుడు అవి మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తరువాతే వాటిని తాగేందుకు, తినేందుకు ప్రయత్నించాలి. అధిక లేదా దీర్ఘకాలిక ఆల్కహాల్ వాడకం అభిజ్ఞా ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాలను చూపుతుంది. కాబట్టి మెదడును కాపాడాలనకుంటే కచ్చితంగా ఆల్కహాల్ వంటివి తాగడం మానేయాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner