Ragi kanji Recipe: ఉదయాన్నే రాగి కంజి తాగారంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు, పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్రేక్‌ఫాస్ట్
Ragi kanji Recipe: రాగి కంజితో కొత్త రుచిని ట్రై చేయండి. రొటీన్ గా రాగి జావ ఎన్నాళ్లని తాగుతారు చెప్పండి. పైగా ఇందులో కాల్షియం కూడా అధికంగా దొరుకుతుందట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి!

కాల్షియం అధికంగా ఉండే రాగి కంజి బ్రేక్ ఫాస్ట్ (PC: instagram @somewhatchef)
రాగి కంజి రెసిపీ వినడానికి కొత్తగా అనిపించినా, మిల్లెట్స్ ఆహారం తీసుకునే వారికి ఇది బాగా పరిచయమున్న వంటకమే. రాగి జావ కంటే కాస్త అదనపు రుచిని కలిగి ఉండే వంటకం రాగి కంజి. దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పదిహేను నిమిషాలలోపే చూడగానే వెంటనే తాగేయాలని/తినేయాలని అనిపించేలా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారు కచ్చితంగా ప్రయత్నించాల్సిన రాగి కంజి రెసిపీ చూసేద్దామా!
కావాల్సిన పదార్థాలు:
- ¼ కప్పు రాగి పిండి
- 3/4 కప్పు పెరుగు
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు
- ఉప్పు రుచికి తగినంత
- 500ml నీరు
- కరివేపాకు/కొత్తిమీర
- ఇంగువ (ఆప్షనల్)
తయారీ విధానం
- స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 300ml నీరు పోసుకోండి.
- నీరు కాస్త వేడెక్కిన తర్వాత అందులో రాగి పిండి ఉండలు చుట్టుకోకుండా కలుపుతూ పోయండి.
- పిండి పోసిన ఆ ద్రావణం చిక్కపడేంత వరకూ మరిగించండి.
- ఇప్పుడు కాసేపు చల్లారనివ్వండి.
- అందులో పెరుగు వేసి, రుచికి తగినంత ఉప్పు, నీరు కలుపుకోండి.
- ఇప్పుడు నెయ్యి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర వేయండి.
- అవన్నీ కలిసేలా బాగా తిప్పండి. అంతే రాగి కంజి రెడీ అయినట్లే.
- దీనిని ఫ్రిజ్ లో ఉంచుకుని లేదా అలా ఉండగానే సర్వ్ చేసుకోవచ్చు.
మీరు డైటింగ్ చేస్తున్నట్లయితే రాగులతో చేసిన ఈ రాగి కంజి మంచి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్. మీరు డైటింగ్ లో లేకపోయినా సరే వారానికి ఒకసారి కచ్చితంగా తీసుకోదగిన ఆహారం ఇది. పోషకాహారమైన ఈ రాగికంజి చాలా ఆరోగ్యకరమైనది. రాగుల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- జీర్ణక్రియ: రాగుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్దకం లేకుండా చేస్తుంది.
- బరువు నియంత్రణ: రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తిన్న/తాగిన వెంటనే కడుపు నిండుగా ఫీల్ అయి ఎక్కువ కేలరీలు తీసుకునే అవసరం రానివ్వదు.
- ఎముకల ఆరోగ్యం: కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రాగుల్లో అధికంగా ఉంటాయి. ఇవి ఆస్టియాపోరోసిస్, అనీమియా రాకుండా కాపాడతాయి.
- డయాబెటిస్: వీటిల్లో ఉండే కార్బొహైడ్రేట్స్, ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తాయి.
- కేశారోగ్యం: రాగులు అనేవి ప్రొటీన్ కంటెంట్, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి.
- రక్తపోటు: వీటిల్లో ఉండే ఫైబర్ రక్తంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
- యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు: ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడేందుకు రాగులు తోడ్పాడును అందిస్తాయి.
- యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు: రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, వృద్ధాప్య ఛాయలను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.
సంబంధిత కథనం