Coffee: మీరు కాఫీ ఇలా తాగితే శరీరంలో ప్లాస్టిక్ చేరిపోయే ప్రమాదం, కాఫీ ఎలా తాగాలో తెలుసుకోండి-if you drink coffee like this you risk getting plastic in your body learn how to drink coffee ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee: మీరు కాఫీ ఇలా తాగితే శరీరంలో ప్లాస్టిక్ చేరిపోయే ప్రమాదం, కాఫీ ఎలా తాగాలో తెలుసుకోండి

Coffee: మీరు కాఫీ ఇలా తాగితే శరీరంలో ప్లాస్టిక్ చేరిపోయే ప్రమాదం, కాఫీ ఎలా తాగాలో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Jan 27, 2025 07:30 AM IST

కాఫీ అంటే ఎంతో మందికి ఇష్టం. అందులో మీరు కూడా ఉంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే పేపర్ కప్పులో కాఫీ తాగుతున్నారా? పరిశోధన ప్రకారం, ఒక వేడి ద్రవాన్ని ఒక పేపర్ కప్పులో పావుగంట సేపు ఉంచడం వల్ల వెయ్యికి పైగా మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి.

కాఫీ ఇలా తాగితే ఎంతో ప్రమాదం
కాఫీ ఇలా తాగితే ఎంతో ప్రమాదం (pixabay)

కాఫీతోనే మీ రోజును మొదలుపెడతారా? అయితే మీరు కొన్ని అంశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతూ ఉంటే ఆ కిక్కే వేరు. ఒక గ్లాస్ కప్పులో లేదా స్టీల్ కప్పులో వేడి కాఫీ తాగుతుంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొందరు పేపర్ కప్పులో కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ప్లాస్టిక్ కప్పులతో పోలిస్తే స్టీల్, గాజు గ్లాసులో తాగడం పర్యావరణానికి, ఆరోగ్యానికి మంచిది. పేపర్ కప్పుల్లో లేదా ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ తాగడం వల్ల శరీరంలో మైక్రో ప్లాస్టిక్ చేరే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం ఒక వేడి ద్రవాన్ని లేదా ఆహారాన్ని పేపర్ కప్పులో పావుగంట పాటు వేయడం వల్ల 1,000 కంటే ఎక్కువ చిన్న ప్లాస్టిక్ కణాలు ఆ ఆహారంలో చేరుతాయి. ఒక పేపర్ కప్పులో 3 కప్పుల కాఫీ తాగడం 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలే శరీరంలో చేరే అవకాశం ఉంది.

yearly horoscope entry point

ప్లాస్టిక్ తో ప్రమాదం

ప్లాస్టిక్ వస్తువులు సర్వత్రా ఉన్నాయి. మన చుట్టూ ఎక్కువగా వాడేవి ప్లాస్టిక్ తో చేసిన వస్తవులే. కంటికి కనిపించే ప్లాస్టిక్ మాత్రమే కాదు, కనిపించని ప్లాస్టిక్ కణాలు కూడా ఉన్నాయి. మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయో నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాయి. అందుకే పేపర్ కప్పులో వేడి వేడి కాఫీ లేదా టీ తాగడం ప్రమాదకరమని రుజువైంది.

పేపర్ కప్పుతో ప్రమాదాలు

ప్లాస్టిక్ కప్పుల కంటే పేపర్ కప్పులు ఆరోగ్యకరం అన్న మాట వాస్తవమే. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది అనుమానమే.పేపర్ కప్పులో వేడి వేడి కాఫీ లేదా టీ తాగడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.పేపర్ కప్పు లోపలి భాగంలో ప్లాస్టిక్ పూత పూస్తారు. దీని వల్ల వేడి పానీయంలోకి విషపూరిత రసాయనాలను కలుపుతారు నిపుణులు.

ఖగర్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఒక ప్లాస్టిక్ కప్పులో పావుగంట సేపు వేడి పానీయం ఉంచితే 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలు, హానికరమైన అయాన్లు, హెవీ మెటల్ ను ఆ కాఫీలోకి విడుదల అవుతాయని అధ్యయనం తెలిపింది. వేడి కాఫీ ఉన్న పేపర్ కప్పులో ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్, సల్ఫేట్ వంటి విషపూరిత లోహం లాంటి అయాన్లను పరిశోధకులు కనుగొన్నారు.

మైక్రోప్లాస్టిక్స్ ఉన్న పేపర్ కప్పులో వేడి కాఫీ లేదా టీ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, ప్రేగు సమస్యలు, క్యాన్సర్, నరాల సమస్యలకు దారితీస్తుంది.

కూల్ డ్రింక్స్ తాగవచ్చా?

ఐఐటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ గ్లాసుల్లో నీటిని ఉంచడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి పేపర్ కప్పులో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

కాఫీ తాగడానికి సురక్షితమైన మార్గం

మైక్రోప్లాస్టిక్స్ విడుదల చేసే పేపర్ కప్పులో కాకుండా స్టీల్ లేదా గాజు గ్లాసులో వేడి కాఫీ, టీ వంటివి తాగడం ఆరోగ్యకరమే .ఇది మీ ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం