Negative Energy: ఇంట్లో ఇలా చేశారంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది-if this is done at home the negative energy will go out and the mind will be calm ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Negative Energy: ఇంట్లో ఇలా చేశారంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది

Negative Energy: ఇంట్లో ఇలా చేశారంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Published Feb 07, 2025 07:30 AM IST

Negative Energy: ఇంట్లో అశాంతి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఓసారి మీ ఇంట్లోని వస్తువులను, పరిస్థితిని చూడండి. నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నా కూడా ఇలా కుటుంబ సభ్యులకు అశాంతి పెరుగుతుంది. కొన్ని చిట్కాల ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవచ్చు.

పాజిటివ్ ఎనర్జీకి ఏం చేయాలి?
పాజిటివ్ ఎనర్జీకి ఏం చేయాలి? (shutterstock)

ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన ప్రదేశాం. బయట ఎన్ని టెన్షన్లు, బాధలు ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ చేరేది ఇంటికే. ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండేందుకు ఇల్లు మంచి ప్రదేశం. కానీ ఒక్కోసారి వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించదు. కుటుంబ సభ్యులతో గొడవలు, మూడ్ బాగోకపోవడం, చిన్న చిన్న విషయాలు చికాకులు పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇలా మీ ఇంట్లోనూ జరుగుతుంటే ఆ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఈ చిన్న పనులు చేయవచ్చు. ఆ పనులేంటో ఇక్కడ ఇచ్చాము. వీటిని ఫాలో అయితే మీ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

పనికిరాని వస్తువులు

ఇంట్లో ఉన్న పనికిరాని, ఉపయోగించని, పాత, విరిగిన వస్తువులను తొలగించండి. వాటిని అలా పోగుపోసి ఇంట్లో ఉంచకండి. తీగలు, ఛార్జర్లు, మొబైల్స్ వంటివి పాడైపోయినా కూడా అలాంటి వస్తువులను వెంటనే ఇంటి నుంచి తొలగించాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటానికి ఇవి కారణం అవుతాయి.

స్వచ్ఛమైన గాలి

ఇంట్లోని ఏ మూలలోనైనా వెలుగు ప్రసరించేలా ఉండాలి. కిటికీలు లేదా తలుపులు ఎకకువ తెరిచి ఉంచడానికి ప్రయత్నించండి. తద్వారా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇది ఇంట్లో బ్యాక్టీరియా పెరగడానికి అనుమతించదు. అలాగే ప్రతికూల శక్తి నుండి పారిపోతుంది.

సహజమైన కాంతి లేదా సూర్యరశ్మిని ఇంటి మూలల్లో పడేలా చూడండి. కిటికీ లేదా తలుపు లేనట్లయితే, దానిని అద్దం సహాయంతో ప్రతిబింబించేలా చేయవచ్చు. దీనివల్ల ఇంటి మూలన సూర్యరశ్మి, సహజ వెలుతురు ఉంటుంది. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి.

ప్లాస్టిక్ పూలకు బదులు మొక్కలు

ఇంట్లో చాలా మంది రకరకాల ప్లాస్టిక్ మొక్కలు, పువ్వులు అలంకరిస్తారు. ఇంట్లో ప్లాస్టిక్ చెట్లు, మొక్కలకు పెట్టే బదులు నిజమైన మొక్కలు పెడితే మంచిది. ఇండోర్ మొక్కలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇంట్లో ఉంచడం వల్ల ఇవి గాలిని శుద్ధి చేయడంతో పాటు సానుకూలతను తీసుకొస్తాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.

కర్పూరంతో

ఇంట్లో మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తే ఇంట్లో కర్పూరాన్ని కాల్చేందుకు ప్రయత్నించండి. ఇందులో ఎన్నో ఔషధ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లోని ప్రతికూల ప్రకంపనలు తొలగిపోతాయి.

రాతి ఉప్పుతో

ప్రతి ఇంట్లో రాతి ఉప్పు ఉంటుంది. రాతి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది.

మత చిహ్నాలను ఉంచండి

ఆధ్యాత్మిక చిహ్నాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచండి. ఓంకారం, స్వస్తిక్ గుర్తులు వంటివి ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం