డయాబెటిస్ అంటే కేవలం పెద్దల్లో వచ్చేదని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి డయాబెటిస్ ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తున్నట్టు గుర్తించారు. వారసత్వంగా అలాగే చెడు జీవనశైలి కారణంగా ఇలా డయాబెటిస్ వస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వారిలో కనిపించే కొన్ని రకాల లక్షణాలను తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు.
పిల్లల్లో డయాబెటిస్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి తల్లిదండ్రుల అర్థం చేసుకొని తగిన చికిత్సను సరైన సమయానికి అందించాలి.
పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల లక్షణాలు ఒకేసారి బయటపడవు. తక్కువగా ఈ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. మీ బిడ్డ తగినంత నీరు తాగుతూ ఉన్నా కూడా తరచూ దాహం వేస్తుంటే మీరు ఆ విషయాన్ని విస్మరించకూడదు. టైప్ 2 డయాబెటిస్ లో ఎంత నీరు తాగినా దాహం వేయడం అనేది ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకుంటారు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయినప్పుడు అవి కణజాలాల నుండి ద్రవాన్ని ఫీల్ చేసుకుంటాయి. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. అందుకే ఎంత నీరు తాగిన దాహం వేస్తూనే ఉంటుంది.
ఇక నీరు తాగిన తర్వాత తరచూ మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు. మూత్రపిండాల్లో గ్లూకోజ్ అధికంగా పెరిగినప్పుడు అది మాత్రం ద్వారా బయటికి పోతుంది. అందుకే తరచూ పిల్లలు మాత్రం మూత్రవిసర్జనకు వెళుతూ ఉంటారు. ఇలా వెళుతూ ఉన్నా కూడా మీరు తేలిగ్గా తీసుకోకుండా తగిన చికిత్సలు చేయించాలి. తగిన పరీక్షలు చేయించాలి.
పిల్లలు చక్కగా తింటున్న కూడా బరువు పెరగకుండా.. తగ్గుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా సీరియస్ విషయంగానే తీసుకోవాలి. ఆకలి వేస్తున్నప్పటికీ ఆహారం తింటున్నప్పటికీ బరువు తగ్గిపోతున్నారంటే అది మధుమేహానికి ఒక హెచ్చరికగా భావించాలి. అలాగే పిల్లల్లో ఆకలి అధికంగా పెరగడం కూడా మధుమేహానికి వచ్చిందని చెప్పే వార్నింగ్ సైన్ గానే తెలుసుకోవాలి.
పిల్లల్లో తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల శరీరం శక్తి కోసం గ్లూకోజ్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంది. అప్పుడు ఇది కొవ్వు కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి బరువు తగ్గడం అనేది మంచి లక్షణం కాదు.
పిల్లలు బలహీనంగా కనిపిస్తున్న నిత్యం అలసిపోయినట్టు ఒకచోట కూర్చోవడం, పడుకోవడం వంటివి చేస్తున్నా కూడా డయాబెటిస్ వచ్చిందేమోనని అనుమానించాలి. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు గ్లూకోజ్ ను కణాలు ఉపయోగించుకోలేవు. దీనివల్ల వారిలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసంగా, బద్దకంగా, చిరాకుగా ఉంటారు. ఈ పని పైన ఏకాగ్రత పెట్టలేరు. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో గుర్తిస్తే మీరు వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించండి.
చర్మంపై ఎక్కడైనా నల్లగా మచ్చలు కనిపిస్తున్న తేలిగ్గా తీసుకోకండి. ముఖ్యంగా మెడ చుట్టూ, చంకల్లోనూ, గజ్జల్లోను ఇలాగా నల్ల మచ్చలు కనబడకూడదు. ఇది ఇన్సులిన్ నిరోధకతను సూచిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో ఈ నల్ల మచ్చలకు అనుబంధం ఉంటుంది. అక్కడ ఉన్న చర్మం గరుకుగా మారి ముదురు రంగు ప్యాచ్ లాగా ఏర్పడుతున్నా కూడా తేలిగ్గా తీసుకోకండి. చాలామంది ఇలా చర్మం గరుకుగా మారి ప్యాచుల్లా ఏర్పడితే తామర అనుకుంటారు... కానీ అది డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు.
పైన చెప్పిన లక్షణాలలో ఏది మీ బిడ్డలో కనిపించిన వెంటనే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేయించి మధుమేహం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్