Plants and Snakes: పెరట్లో ఈ మొక్కలు ఉంటే విషపూరిత పాములు వచ్చే అవకాశం, జాగ్రత్త-if these plants are in the yard there is a possibility of poisonous snakes be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plants And Snakes: పెరట్లో ఈ మొక్కలు ఉంటే విషపూరిత పాములు వచ్చే అవకాశం, జాగ్రత్త

Plants and Snakes: పెరట్లో ఈ మొక్కలు ఉంటే విషపూరిత పాములు వచ్చే అవకాశం, జాగ్రత్త

Haritha Chappa HT Telugu

Plants and Snakes: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి బాల్కనీ, లాన్ లో రకరకాల చెట్లను నాటుతుంటాం. కానీ ప్రతి మొక్క మన ఇంటికి మంచిది కాదు. వీటిలో కొన్ని అనేక రకాల కీటకాలు మరియు విషపూరిత పాములను ఆకర్షించే మొక్కలు. ఈ రోజు మేము మీకు ఆ మొక్కల గురించి చెప్పబోతున్నాము.

పాములను ఆకర్షించే మొక్కలు (Shutterstock)

ఇంటి లాన్ లేదా బాల్కనీలో అందమైన మొక్కలు అందంగా కనిపిస్తాయి. ఇల్లు ఎంత అందంగా ఉన్నా మొక్కలతో నిండి ఉంటే ఆ అందమే వేరు. ఇంటి బాల్కనీలో అందమైన పూల మొక్కలను నాటడం వల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. కొన్ని మొక్కలను ఇంటి బాల్కనీ లేదా పెరట్లో పెంచడం వల్ల… హాని కలిగే అవకాశం ఉంది. కొన్ని మొక్కలను పెంచడం వర్షాకాలంలో హానితో కూడుకున్నది. అవి పాములు, కీటకాలను ఆకర్షిస్తాయి. ఆ మొక్కలు ఏవో తెలుసుకోండి.

మల్లె

మల్లె మొక్క చాలా దట్టంగా పెరుగుతుంది. మల్లె పువ్వుల సువాసన చాలా బలంగా ఉంటుంది. ఇది పాములను ఆకర్షిస్తుంది. ఈ మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఆ చెట్టు నీడలో పాములు దాని లోపల దాక్కుని ఉంటాయి. కాబట్టి మీ బాల్కనీలో లేదా గార్డెన్లో మల్లె మొక్క ఉంటే వానాకాలంలో వెంటనే తొలగించండి.

నిమ్మ చెట్టు

ఇంటి బాల్కనీ లేదా పెరట్లో నాటిన నిమ్మ చెట్టు సాధారణంగా మంచిదే. కానీ వానాకాలంలో మాత్రం చాలా హానికరం. నిమ్మ చెట్టు చుట్టూ అనేక కీటకాలు, ఎలుకలు నివసిస్తాయి. వీటితో పాటు అనేక పక్షులు కూడా నిమ్మ చెట్టు విత్తనాలను తినడానికి ఇష్టపడతాయి. అందుకే పాములు కూడా తమ ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ మొక్క చుట్టూ తిరుగుతున్నాయి. మీ ఇంట్లో ఈ చెట్టు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పాములు చేరకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.

సైప్రస్ మొక్క

ఇది ఒక రకమైన అలంకరణ మొక్క. ఇది తరచుగా గృహాల బాల్కనీ, పచ్చిక మైదానంలో కనిపిస్తుంది. అయితే ఈ దట్టమైన మొక్క పాముల గూడుగా మారుతుందని అంటారు. ఇది చాలా దట్టంగా పెరుగుతుంది. దీని వల్ల పాములు ఈ పొదలాంటి మొక్కలో సులభంగా దాక్కోగలవు. అందుకే సైప్రస్ మొక్కలు బాల్కనీ లేదా పెరట్లో నాటిన ఈ మొక్కలు ఇంట్లోకి పాములు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఇవే కాకుండా అనేక ఇతర విష కీటకాలు కూడా ఈ మొక్కలో గూడు కట్టుకోవచ్చు.

దానిమ్మ

దానిమ్మ చెట్టు పాములకు మంచి నివాసంగా మారుతుంది. దానిమ్మ చెట్టు దగ్గర పాములు తరచుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ మొక్కను ఇంట్లో లేకుండా నివారించాలి. పాములే కాకుండా, ఇతర ప్రమాదకరమైన కీటకాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీని కారణంగా ఇది ఇంటి ఆవరణలో నాటడానికి మంచి మొక్క కాదు.

ఆవరణలో పచ్చని గడ్డి ఉంటే

ఇంటి ముందు పచ్చని గడ్డి ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఇది చూడటానికి అందంగా ఉన్నా…కొన్ని రాక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పొడవాటి పచ్చని గడ్డి మధ్య చాలా కీటకాలు నివసిస్తాయి. దీని వల్ల పాములు కూడా చాలాసార్లు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. పాములకు ఆహారంతో పాటు దాక్కోవడానికి స్థలం కూడా లభిస్తుంది. కాబట్టి మీ ఆవరణలో పచ్చిగడ్డి ఉంటే ఎప్పటికప్పుడు కోస్తూ ఉండండి. అప్పుడప్పుడు క్రిమిసంహారక మందులను చల్లుతూ ఉండాలి.