Chapati Making: రోటీ చపాతీలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే పోషకాలు తగ్గిపోతాయి, వాటిని ఇలా వండితే ఎంతో ఆరోగ్యం-if these mistakes are made while making roti chapatis the nutrients will be reduced ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chapati Making: రోటీ చపాతీలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే పోషకాలు తగ్గిపోతాయి, వాటిని ఇలా వండితే ఎంతో ఆరోగ్యం

Chapati Making: రోటీ చపాతీలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే పోషకాలు తగ్గిపోతాయి, వాటిని ఇలా వండితే ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Jan 16, 2025 07:00 PM IST

అన్నం కన్నా చపాతీలు, రోటీలు ఆరోగ్యకరమని నమ్ముతారు. గోధుమలతో చేసే రోటీలు, చపాతీలు సరిగా చేసే పద్ధతి తెలుసుకోవాలి. వీటిని మరింత పోషకమైనవిగా చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి
చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి (Shutterstock)

మనదేశంలో అన్నం తరువాత అధిక శాతం మంది తినే ఆహారం చపాతీలు, రోటీలే. ఉత్తర భారతదేశంలో ప్రతిరోజూ చపాతీలు, రోటీలే తింటారు. ఇవే వారి ప్రధాన ఆహారం. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా అన్నాన్ని మానేసి చపాతీలు తినడం మొదలుపెట్టారు. కానీ వీటిని చేసే పద్ధతి ప్రకారమే అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

రోటీ, చపాతీలు తయారు చేయడానికి అనేక రకాల పిండి అందుబాటులో ఉన్నప్పటికీ, అధిక శాతం మంది గోధుమ పిండినే వాడతారు. రోటీలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ, ఇతర పోషకాలు మాత్రం తక్కువగా ఉంటాయి. చపాతీలు తయారుచేసే పద్ధతిని బట్టి అందులోని పోషకాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సులభమైన చిట్కాల ద్వారా రోటీ చపాతీలను పోషకాహారంగా మార్చుకోవచ్చు.

పిండిలో వీటిని కలపండి

ప్రతిరోజూ అదే సాధారణ గోధుమ పిండితో చేసిన రోటీ, చపాతీలను తినే బదులు దానికి మరికొన్ని పోషకాహారాలను జోడించవచ్చు. ఇవి రుచిని పెంచడంతో పాటూ పోషకాలను అందిస్తుంది. గోధుమ పిండిలో పావు స్పూను మెంతి గింజల పొడి లేదా రెండు స్పూన్లు అవిసె గింజల పొడి, గుమ్మడికాయ విత్తనాల పొడి, శెనగపిండి, సోయాబీన్ పౌడర్ వంటి వాటిని జోడించవచ్చు. ఇవే కాకుండా ఇంట్లో ఏ సీజనల్ వెజిటబుల్స్ ఉన్నా వాటిని తురిమి పిండిలో కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రొట్టెలు ఆరోగ్యంగా, చాలా టేస్టీగా ఉంటాయి.

రొట్టెల కోసం పిండిని కలిపేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది రోటీలు మెత్తగా వచ్చేందుకు పిండిలో పాలు, నూనె వంటివి కలుపుతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. పిండిని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కలపండి చాలు. రోటీలను మరింత పోషకాహారంగా, రుచికరంగా చేయడానికి మజ్జిగ, బియ్యం నీరు, బీట్రూట్ లేదా పాలకూర పేస్టును కూడా ఉపయోగించవచ్చు.

నేరుగా మంటపై కాల్చడం మంచిది కాదు

ఇళ్లలో రోటీలు కాల్చడానికి తప్పుడు పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో రోటీని పెనంపై కాసేపు వేయించి తరువాత నేరుగా గ్యాస్ మంట మీద కాలుస్తారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. వాస్తవానికి, మీరు రోటీని నేరుగా మంటపై కాల్చినప్పుడు అది పూర్తిగా కాలదు. దీనివల్ల పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఇది జీర్ణం కావడం కష్టం. అటువంటి పరిస్థితిలో, రోటీని ఎల్లప్పుడూ పెనం మీద మాత్రమే కాల్చడం సరైన మార్గం. కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కానీ రోటీలు ఆరోగ్యంగా, రుచిగా ఉంటాయి.

చపాతీల కోసం పిండిని కలిపిన వెంటనే రోటీలు చేసేయవచ్చు. పిండిని 10 నుండి 20 నిమిషాలు ఇలా వదిలేయండి. ఇది పిండిలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అలాగే చపాతీ, రోటీ కాల్చేందుకు నాన్-స్టిక్ పెనానికి బదులు… బంకమట్టితో లేదా ఇనుముతో చేసిన పెనం వాడడం మంచిది.

Whats_app_banner