Milk Boiling Mistakes: పాలను మరిగించేటప్పుడు ఈ తప్పులు చేస్తే అందులోని పోషకాలన్ని పోతాయి-if these mistakes are made while boiling the milk all the nutrients in it will be lost ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Boiling Mistakes: పాలను మరిగించేటప్పుడు ఈ తప్పులు చేస్తే అందులోని పోషకాలన్ని పోతాయి

Milk Boiling Mistakes: పాలను మరిగించేటప్పుడు ఈ తప్పులు చేస్తే అందులోని పోషకాలన్ని పోతాయి

Haritha Chappa HT Telugu
Published Feb 19, 2025 03:30 PM IST

పాలు ప్రతి ఇంట్లో మరిగిస్తూనే ఉంటారు. అయితే పాలు మరిగించేటప్పుడు చాలా మంది పాలలోని పోషకాలను తొలగించే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పోషకాలు పోయిన సంగతిని కూడా వారు గుర్తించలేరు.

పాలు మరిగించేటప్పుడు చేయకూడని తప్పులు
పాలు మరిగించేటప్పుడు చేయకూడని తప్పులు (Shutterstock)

పిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా, పాలు ప్రతి ఒక్కరి ఆహారంలో చాలా ముఖ్యమైన ఆహారం. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి పాలను 'కంప్లీట్ ఫుడ్' అని పిలుస్తారు. పాలను మరిగించి మాత్రమే తాగాలని, పచ్చిపాలు తాగకూడదని వైద్యులు సిఫారసు చేస్తారు. దీనివల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనివల్ల వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

పాలను మరిగించేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎంతో మందికి పాలను మరిగించడానికి సరైన మార్గం తెలియదు, దీని వల్ల పాలలో ఉండే పోషకాలు నాశనం అవుతాయి. అలాంటి పోషకాలు నశించిన పాలు తాగడం వల్ల అంత ప్రయోజనకరంగా ఉండవు. కాబట్టి పాలు మరిగేటపుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోండి. అలాగే పాలు మరిగించే సరైన మార్గాన్ని కూడా తెలుసుకోవడం ముఖ్యం.

పదే పదే పాలు మరిగించవద్దు

మీరు పాలలోని పోషకాలు నాశనం కాకుండా నిలుపుకోవాలనుకుంటే, మీరు పాలను పదేపదే మరిగించడం మానుకోవాలి. ఒకసారి మరిగించాక దాన్ని మళ్లీ మరిగించడం మానేయాలి. చాలా మంది మహిళలు పాలను తాజాగా ఉంచడానికి పదేపదే మరిగిండం అనే తప్పును చేస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పాలను పదేపదే మరిగించడం వల్ల అందులోని పోషకాలు మాయమవుతాయని, పాల వల్ల శరీరానికి పూర్తి ప్రయోజనం లభించదని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. పాలను ఒకసారి మాత్రమే మరిగించి, తాగే ముందు కొద్దిగా మాత్రమే వేడి చేయడానికి ప్రయత్నించండి.

కొంతమంది మహిళలు తక్కువ మంటపై పాలను ఎక్కువసేపు మరిగించాలి. ఇది సాధారణంగా పాలను చిక్కగా చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే అలా చేయడం ఎంతమాత్రం సరికాదు. తక్కువ మంట మీద ఎక్కువ సేపు పాలను మరిగించడం వల్ల అందులోని పోషకాలు తగ్గుతాయి. దీని వల్ల పాల వల్ల పూర్తి ప్రయోజనం మన శరీరానికి లభించదు. ఎల్లప్పుడూ పాలను మీడియం మంటపై మరిగించి, అప్పుడప్పుడు చెంచా కలుపుతూ ఉండాలి.

పాలను పెద్ద మంటపై మరిగించకూడదు

పాలు త్వరగా మరిగిపోవాలన్న ఉద్దేశంతో కొంతమంది పెద్దమంట పెట్టి మరిగిస్తారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి పాలను పెద్ద మంటపై మరిగించడం వల్ల అందులోని చక్కెర కరిగిపోతుంది. అందువల్ల, పాలను మీడియం మంటపై మరిగించేటప్పుడు కలియబెట్టండి. తద్వారా దానిలో ఉండే కొవ్వు, నీరు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు కలిసి ఉంటాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం