Diabetes Mistakes: ఈ తప్పులు చేస్తే డయాబెటిస్ వ్యాధి మరింత ముదిరిపోతుంది, జాగ్రత్త-if these mistakes are made the disease of diabetes will increase be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Mistakes: ఈ తప్పులు చేస్తే డయాబెటిస్ వ్యాధి మరింత ముదిరిపోతుంది, జాగ్రత్త

Diabetes Mistakes: ఈ తప్పులు చేస్తే డయాబెటిస్ వ్యాధి మరింత ముదిరిపోతుంది, జాగ్రత్త

Haritha Chappa HT Telugu
Jul 03, 2024 10:30 AM IST

Diabetes Mistakes: డయాబెటిస్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే కొన్ని తప్పులు వారిలో షుగర్ స్పైక్‌కు కారణం అవుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యను పెంచుతుంది.

డయాబెటిస్
డయాబెటిస్ (shutterstock)

డయాబెటిస్ వచ్చిందంటే జీవితమే మారిపోతుంది. తినే ఆహారం నుంచి వ్యాయామం వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైప్ 2 డయాబెటిస్ అనేది జీవనశైలి రుగ్మత. ఇది వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల డయాబెటిస్ వ్యాధిని పెంచుకుంటున్నారు. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయకపోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఆయుర్వేదం వైద్యులు డయాబెటిస్ ను ఎలా అదుపులో పెట్టుకోవాలో వివరిస్తున్నారు.

ఈ తప్పులు చేయవద్దు

చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు తీపి తినాలనిపించినప్పుడు చక్కెరకు బదులుగా బెల్లం లేదా ఏదైనా స్వీట్ తినేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే బెల్లం లేదా చక్కెర మిఠాయి తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బెల్లం మిఠాయిలు ఆరోగ్యకరమైనవే అయినా డయాబెటిక్ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి. బెల్లం, తేనె వంటివి కూడా తినకుండా ఉండడమే మంచిది.

భోజనం తిన్నాక పండ్లు తినే వారి సంఖ్య ఎక్కువ. పండ్లలోని మాధుర్యం తినాలన్న కోరికను పెంచేస్తుంది. కానీ ఈ అలవాటు మంచిది కాదు. భోజనం తిన్నాక ఎంతో కొంత షుగర్ శరీరంలో చేరుతుంది. ఆ తరువాత తిన్న పండ్లలో కూడా సహజ చక్కెర ఉంటుంది. భోజనంలో ఉన్న చక్కెర, పండ్లలో ఉన్న చక్కెర కలిసి విపరీతంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. విడివిడిగా చూస్తే భోజనం, పండ్లు రెండూ కూడా ఆరోగ్యకరమైనవే. కానీ ఒకేసారి వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు భోజనం తరువాత పండ్లు తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం ఏర్పడతాయి. భోజనం తర్వాత పండు తింటే జీర్ణం కాని ఆహారం చిన్నపేగుకు చేరి అజీర్ణం వంటి సమస్యలు మొదలవుతాయి.

డయాబెటిస్ రోగులు పెరుగుకు బదులు మజ్జిగ తాగడం అవసరం. ఆయుర్వేదంలో పెరుగు స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెరుగు వేడి చేస్తుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది శరీరంలో కఫ దోషాలను పెంచుతుంది. ఇది కఫ దోషం బరువును పెంచుతుంది. జీవక్రియ బలహీనంగా ఉంటుంది. కఫ దోషం కారణంగా పోషకాహారాన్ని గ్రహించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటప్పుడు పెరుగుకు బదులు మజ్జిగ తాగితే మంచిది.

డయాబెటిస్ రోగులు ఆహారం విషయంలో పైన చెప్పిన తప్పులను తరచు చేయకూడదు. ఇది చక్కెర వ్యాధిని పెంచేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతలో సమస్యలను కలిగిస్తుంది.

Whats_app_banner