Skin Glow: పార్లర్ ఫేషియల్స్ ఖరీదైనవిగా అనిపిస్తే ఇంట్లో ఉన్న వస్తువులతో ఫేషియల్స్ చేసుకోండి-if parlor facials seem expensive try facials with items at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Glow: పార్లర్ ఫేషియల్స్ ఖరీదైనవిగా అనిపిస్తే ఇంట్లో ఉన్న వస్తువులతో ఫేషియల్స్ చేసుకోండి

Skin Glow: పార్లర్ ఫేషియల్స్ ఖరీదైనవిగా అనిపిస్తే ఇంట్లో ఉన్న వస్తువులతో ఫేషియల్స్ చేసుకోండి

Haritha Chappa HT Telugu
Oct 22, 2024 09:30 AM IST

Skin Glow: పార్లర్ ఫేషియల్స్ ఖరీదైనవిగా కనిపిస్తే ఇంట్లోని వస్తువులతో ఫేషియల్స్ చేసుకోవచ్చు. ఇంట్లో సులభంగా ఫేషియల్స్ చేయడానికి కొన్ని ఉత్పత్తులను వాడవచ్చు.

ఇంట్లోనే ఫేషియల్
ఇంట్లోనే ఫేషియల్

మహిళలు ముఖాన్ని మెరిపించుకోవడానికి రకరకాల క్రీములు వాడతారు. అదే సమయంలో పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ ప్రయత్నిస్తారు. మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, ఇది అందాన్ని పెంచుతుంది. మంచి చర్మం కోసం పౌష్టికాహారం అవసరం, స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి సహజమైన వాటిని ఉపయోగించడం అవసరం. బయట పార్లర్లో ఫేషియల్స్ రూ 500 నుంచి రెండు వేల రూపాయల ఖరీదు ఉంటాయి. ఇంట్లో దొరికే కొన్ని ఉత్పత్తులు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో తినేందుకు కొనుక్కున్న వాటినే బ్యూటీకి వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఎలాంటి పదార్థాలు ఫేషియల్ కి ఉపయోగపడతాయో తెలుసుకోవచ్చు.

పెరుగు

ప్రతి ఇంట్లో పెరుగు ఉండడం సహజం. ఇది చర్మంపై నేచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. దీని వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని సాయంతో ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పెరుగులోనే బియ్యప్పిండి, పసుపు కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయాలి. మసాజ్ కోసం పెరుగులో తేనె లేదా కలబంద జెల్ మిక్స్ చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. చివరగా పెరుగు, గంధం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సాధారణ నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఇలా వేడుకలకు ముందు రెండు మూడు రోజుల ముందు నుంచే చేస్తూ ఉంటే మీ ముఖం మెరవడం ఖాయం.

కలబంద జెల్

కలబంద జెల్ తాజా చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది ముఖంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ముందుగా అలోవెరా జెల్ ను ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ లో ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దానితో స్క్రబ్ చేయండి. మసాజ్ చేయడానికి అలోవెరా జెల్ లో కీరదోసకాయ రసం మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి. ఇప్పుడు కలబంద గుజ్జులో రోజ్ వాటర్, విటమిన్ ఇ కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. విటమిన్ ఇ క్యాప్సూల్ మార్కెట్లో దొరుకుతాయి.

పచ్చి పాలు

పాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. శుభ్రమైన ముఖానికి ఒక చెంచా పచ్చి పాలను అప్లై చేసి, తర్వాత కాటన్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీనితో ఫేషియల్స్ చేయాలంటే పచ్చి పాలలో శెనగపిండి వేసి స్క్రబ్ చేయాలి. అలోవెరా జెల్, పచ్చి పాలు కలిపి మసాజ్ చేయాలి. చివరగా ఒక చెంచా పచ్చి పాలలో ముల్తానీ మిట్టి, తేనె, రోజ్ వాటర్ కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పావు గంట సేపు వదిలేసి తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖానికి మాయిశ్చరైజర్ లా ఉపయోగపడుతుంది.

Whats_app_banner