Tea for Hair: గ్రీన్ టీ ను ఇలా ఉపయోగించారంటే జుట్టు రాలడం చాలా వరకు ఆగిపోతుంది-if green tea is used like this it is possible to stop hair loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea For Hair: గ్రీన్ టీ ను ఇలా ఉపయోగించారంటే జుట్టు రాలడం చాలా వరకు ఆగిపోతుంది

Tea for Hair: గ్రీన్ టీ ను ఇలా ఉపయోగించారంటే జుట్టు రాలడం చాలా వరకు ఆగిపోతుంది

Haritha Chappa HT Telugu
Jan 13, 2025 06:30 PM IST

Tea for Hair గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీని ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడం ఆపవచ్చు.

జుట్టును రాలకుండా ఆపడం ఎలా?
జుట్టును రాలకుండా ఆపడం ఎలా? (Pixabay)

జుట్టు రాలే సమస్య ఇప్పుడు ఆధునిక కాలంలో ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందికి జుట్టు అధికంగా రాలుతోంది. జుట్టు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే చాలా సింపుల్ పద్ధతిలో మీరు జుట్టును తిరిగి పెంచుకోవచ్చు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగులను ఉపయోగించాలి. గ్రీన్ టీ నీటితో మీ జుట్టును కడగడం ద్వారా జుట్టుకు ఆ నీటిని పట్టించడం ద్వారా వెంట్రుకలు బలోపేతంగా మారుతాయి. కొన్నాళ్లకు జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. గ్రీన్ టీ వాటర్ జుట్టుకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

టీ వాటర్ ఎలా పనిచేస్తుంది

టీ అనగానే ఇంట్లో చేసుకునే పాల టీ అనుకోకండి. కేవలం నీళ్లు, గ్రీన్ టీ బ్యాగులు కలిపిన టీ నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ ఈ రెండు నీళ్లను ఉపయోగించుకోవచ్చు.

గ్రీన్ టీ లో కాటేచిన్స్ అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడానికి సంబంధించిన హార్మోన్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే బ్లాక్ టీ, గ్రీన్ టీ రెండిట్లో కూడా కెఫీన్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మూలాలను బలాపరిచేలా చేస్తుంది. ఇక గ్రీన్ టీ, బ్లాక్ టీ లో ఉండే పాలీఫెనల్స్ మాడు పై రక్తప్రసరణను పెంచుతాయి. జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలు అందేలా చూస్తాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఈ టీ నీళ్లలో ఉంటాయి. ఇవి శిరోజాలకు పోషణ అందిస్తాయి. దెబ్బతిన్న జుట్టును తిరిగి పెరిగేలా చేస్తాయి. టీ నీళ్లను తయారు చేయడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

హెయిర్ వాష్ కోసం గ్రీన్ టీ నీళ్లు తయారీ

మీ జుట్టు కోసం టీ నీటిని తయారు చేయడం చాలా సులభం. రెండు మూడు గ్రీన్ టీ బ్యాగులను తీసుకోండి. రెండు మూడు కప్పుల నీటిని తీసుకోండి. ఆ నీటిలో గ్రీన్ టీ బ్యాగులను వేసి కాసేపు నానబెట్టండి. అందులో లావెండర్ లేదా రోజ్మేరీ నూనెను కొన్ని చుక్కలు వేయండి. ఇప్పుడు ఆ నీటితో తలను తడుపుకోండి. మాడుకు తగిలేలా ఆ నీటిని తలపై పూయండి. అలా అరగంట పాటు వదిలేసి తర్వాత తలను శుభ్రం చేసుకోండి. తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేసుకోండి. ఈ టీ వాటర్ లోని పోషకాలు జుట్టు చర్మంపై ఉన్న పీల్చుకునేందుకు అరగంట సమయమైనా కావాలి. అది మీ నెత్తిలోకీ చొచ్చుకు పోతాయి. మూలాలను బలోపేతం చేస్తాయి. పోషకాలను అందిస్తాయి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే వెంట్రుకలకు మంచి మెరుపును అందిస్తుంది. జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా మారుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner