Green Peas: పచ్చి బఠానీలను ఇలా నిల్వ చేస్తే ఆరునెలల పాటూ తాజాగా ఉంటాయి
Green Peas: గ్రీన్ బఠానీలు సీజనల్ గా చలికాలంలో దొరుకుతాయి. వీటిని ఆరు నెలల పాటూ తాజాగా ఉంచుకునే వీలు ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ ద్వారా పచ్చి బఠానీలను వేసవి కాలంలో కూడా వాడుకోవచ్చు.
చలికాలంలో మాత్రమే దొరికే సీజనల్ పంట పచ్చిబఠానీలు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బంగాళాదుపం, వంకాయల్లో పచ్చి బఠానీలు వేసి వండితే ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే పూరీ, చపాతీలకు జోడీ వండే బఠానీ కూర చాలా రుచిగా ఉంటుంది. వీటిని బయట మార్కెట్లో వేసవి కాలంలో కూడా అమ్ముతారు. వాటిని గడ్డకట్టించి నిల్వ చేసి అమ్ముతారు. వేసవిలో కూడా మీకు తాజా బఠానీలు తినాలనుకుంటే వాటిని మీరు ఇప్పుడే కొని నిల్వ చేసుకోవచ్చు.

బయట దొరకే ఫ్రోజెన్ బఠానీల ధర ఎక్కువ. కాబట్టి వీటిని అందరూ వేసవి కొనుక్కుని తినలేరు. దాని బదులు మీరే డీఫ్రిజ్‌లో ఫ్రోజెన్ బఠానీలు చేయవచ్చు. తాజాగా పచ్చి బఠానీలను నిల్వ చేయడానికి ఈ మార్గాన్ని తెలుసుకోండి. దీని సహాయంతో మీరు దీన్ని ఫ్రీజర్ లో నెలల పాటూ నిల్వ చేసుకోవచ్చు. వేసవిలో కూడా పచ్చి బఠానీల రుచిని ఆస్వాదించవచ్చు.
పచ్చి బఠానీలను ఫ్రీజర్ లో ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. కానీ ఈ బఠానీలను ఒకటి నుండి రెండు నెలల పాటు చాలాసార్లు ఫ్రీజర్లో ఉంచిన తర్వాత చెడిపోతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మార్కెట్ మాదిరిగానే ఫ్రోజెన్ బఠానీల రూపంలో నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు అవి చెడిపోకుండా ఉంటాయి.
పచ్చి బఠానీలను ఎలా నిల్వ చేసుకోవాలి
పచ్చి బఠానీలను ఇంట్లోనే ఫ్రోజెన్ బఠానీలుగా మార్చాలంటే ముందుగా తాజా బఠానీలను కొనుగోలు చేయాలి. వాటిని బాగా కడగాలి. తర్వాత బాణలిలో నీళ్లు పోసి అందులో బఠాణీలు వేయాలి. బఠాణీలను ఐదు నిమిషాలు వేడికి గురిచేయాలి. మరో పాన్ లో నీళ్లు వేసి ఐస్ ముక్కలు వేయాలి. వేడి నీటిలోంచి బఠానీలను తీసి నేరుగా చల్లటి నీటిలో వేయాలి. తరువాత వాటిని తీసి ఒక టవల్ పై వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ జిప్ లాక్ ఉన్న బ్యాగ్ లో వేసి గాలిని తొలగించి బాగా సీల్ చేయాలి. ఈ బఠానీలను ఫ్రీజర్ లో నిల్వ చేస్తే అవి మూడు నుంచి ఆరు నెలల పాటూ నిల్వ చేసుకోవచ్చు. వీటిలోని పోషకాలు కూడా బయటికి పోవు.
మిగతా కూరగాయల్లాగే పచ్చి బఠానీలను తినాల్సిన అవసరం ఉంది. వీటి సాయంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. వీటిలో పోషకాలతో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ప్రొటీన్, ఫైబర్ కూడా వీటిలో ఉంటాయి. కాబట్టి చలికాలంలోనే కాదు వేసవిలో కూడా పచ్చి బఠానీలను తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)