Amla And Weightloss: ఉసిరికాయను ఇలా వాడారంటే మొండి కొవ్వు కూడా కరిగిపోతుంది, బరువు తగ్గిపోతారు
Amla And Weightloss: మీరు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే, ఒక చిన్న ఉసిరికాయ మీకు చాలా సహాయపడుతుంది. ఈ ఐదు విధాలుగా మీ డైట్ లో చేర్చుకోండి. కొన్ని రోజుల్లో అది మీలోని మొండి కొవ్వును కరిగించేస్తుంది.
ఉసిరికాయ శీతాకాలంలో సీజనల్ గా దొరికే పండు. ఇది చూడటానికి చిన్నది కావచ్చు, కానీ దాని ప్రయోజనాలు ఎంతో ఎక్కువ. పులుపు, వగరు రుచితో ఉండే ఈ పండుతో ఊరగాయలు, జ్యూస్ లు వంటి టేస్టీ వంటకాలు తయారు చేస్తారు. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యపరంగాను చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయను అనేక వ్యాధులను తరిమికొట్టడానికి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఉసిరికాయ మీ పెరిగిన బరువును కూడా తగ్గిస్తుంది. కాబట్టి మీ బరువును నియంత్రించడానికి ఈ చిన్న ఉసిరికాయను ఆహారంలో భాగం చేసుకోండి.
ఉసిరి ఇలా వాడండి
పెరిగిన బరువును తగ్గించడంలో ఉసిరి రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఉసిరికాయ రసాన్ని చేర్చవచ్చు. ఉసిరికాయ జ్యూస్ ను రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వచ్చి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు బెల్లీ ఫ్యాట్ ను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉసిరికాయ రసం తయారు చేయడానికి, 1 నుండి 2 ఉసిరికాయలను తీసుకొని కట్ చేసి దాని విత్తనాలను తొలగించాలి. ఇప్పుడు ఉసిరి ముక్కలను మిక్సీలో వేసి, కాసిన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తాగుతూ ఉండాలి. మీరు దీనికి చిటికెడు మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ జ్యూస్ కొవ్వును కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది.
ఉసిరికాయ పచ్చడి
ఉసిరికాయ పచ్చడిని మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా కూడా పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు. తాజా ఉసిరికాయ పచ్చడి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఇది శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి, ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి తాళింపు వేయాలి. అంతే రుచికరమైన ఉసిరి చట్నీ రెడీ అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బరువు చాలా వరకు అదుపులో ఉంటుంది.
ఉసిరి పొడి
పెరుగుతున్న బరువును తగ్గించడానికి ఉసిరి పొడి తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక టీస్పూన్ ఉసిరి పొడిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున, గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటితో పాటు ఉసిరి పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట కూడా బాగా శుభ్రపడుతుంది, ఇది మలబద్దకం వంటి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఉసిరికాయ తినడం వల్ల పెరిగిన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఉదయాన్నే పరగడుపున ఉసిరికాయ తింటే సరిపోతుంది. నిజానికి ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
ఉసిరి జ్యూస్, కలబంద జ్యూస్ కలిపి తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందుకోసం రెండు టీస్పూన్ల అలోవెరా జెల్, రెండు టీస్పూన్ల ఉసిరి రసాన్ని కలపాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండి శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఉసిరిని తినడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గుతారు.
టాపిక్