Bank jobs: గ్రామీణ బ్యాంకుల్లో 8000పైగా ఖాళీలు.. త్వరగా అప్లై చేసుకోండి!-ibps rrb 2022 notification last date to apply for 8285 po clerk posts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ibps Rrb 2022 Notification, Last Date To Apply For 8285 Po, Clerk Posts

Bank jobs: గ్రామీణ బ్యాంకుల్లో 8000పైగా ఖాళీలు.. త్వరగా అప్లై చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Jun 27, 2022 05:39 PM IST

IBPS RRB Recruitment 2022: గ్రామీణ బ్యాంకుల్లో 8000పైగా ఖాళీలు భర్తీ చేయడానికి IBPS ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులకు ఈ రోజే 27 జూన్ 2022 చివరి తేదీ .

IBPS RRB Recruitment 2022
IBPS RRB Recruitment 2022

IBPS RRB క్లర్క్ PO రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. RRB PO క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2022 కింద ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులకు ఈ రోజే 27 జూన్ 2022 చివరి తేదీ . ఇప్పటి వరకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని ఆసక్తిగల అభ్యర్థులు వీలైనంత త్వరగా అధికారిక వెబ్‌సైట్ ibps,in సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

IBPS RRB క్లర్క్ PO రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 8285 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ పోస్టులను భర్తీ చేస్తారు. గతంలో 8106 ఖాళీలు ఉండగా వాటిని 8285కి పెంచారు.

అర్హతలు

నోటిఫికేషన్ ప్రకారం, గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి వరుసగా 28, 30, 32 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే, సంబంధిత స్ట్రీమ్‌లో UG / PG ఉత్తీర్ణత కలిగిన 21 నుండి 40 సంవత్సరాల అభ్యర్థులు ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్‌ను చూడడం ద్వారా తెలుసుకోవచ్చు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్