IBPS Clerk Mains Admit Card 2022 : మెయిన్స్ అడ్మిట్ కార్డ్​ను ఇలా డౌన్​లోడ్ చేయండి-ibps clerk mains admit card 2022 is released here is the download link ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ibps Clerk Mains Admit Card 2022 Is Released Here Is The Download Link

IBPS Clerk Mains Admit Card 2022 : మెయిన్స్ అడ్మిట్ కార్డ్​ను ఇలా డౌన్​లోడ్ చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 30, 2022 10:25 AM IST

IBPS Clerk Mains Admit Card 2022 : IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022ని విడుదల చేసింది. అడ్మిట్ కార్డ్ డౌన్​లోడ్ చేయాలనుకునేవారు అధికారిక వెబ్​సైట్ ibps.inలో లాగిన్ అయి.. డౌన్​లోడ్ చేయవచ్చు. IBPS క్లర్క్ మెయిన్ పరీక్ష 2022 ఎప్పుడు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IBPS Clerk Mains Admit Card 2022
IBPS Clerk Mains Admit Card 2022

IBPS Clerk Mains Admit Card 2022 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సెప్టెంబర్ 29, 2022 (గురువారం)న IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022ని విడుదల చేసింది. అభ్యర్థులు IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022ని అధికారిక వెబ్‌సైట్ ibps.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను కలిగి ఉండాలి.

IBPS క్లర్క్ మెయిన్ పరీక్ష 2022 అక్టోబర్ 8, 2022న నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్షలో ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి. IBPS క్లర్క్ మెయిన్ పరీక్ష 2022 వ్యవధి 160 నిమిషాలు. క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితం సెప్టెంబర్ 21, 2022న ప్రకటించారు.

IBPS Clerk Mains Admit Card 2022 ఇలా డౌన్‌లోడ్ చేయండి..

* IBPS అధికారిక సైట్‌ ibps.inకి వెళ్లండి.

* హోమ్ పేజీలో IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.

* లాగిన్ వివరాలను నమోదు చేసి.. సబ్మీట్ ఆప్షన్​పై క్లిక్ చేయండి.

* మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

* అడ్మిట్ కార్డ్‌ని తనిఖీ చేసి.. పేజీని డౌన్‌లోడ్ చేయండి.

* తదుపరి అవసరం కోసం ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి.

IBPS క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2022 డైరెక్ట్ లింక్. దీనిని క్లిక్ చేసి.. మీ అడ్మిట్ కార్డ్ డౌన్​లోడ్ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం