Hyndai Grand i10 Niosలో CNG వెర్షన్‌ విడుదల, మైలేజ్ అదిరిపోయింది!-hyndai launches cng version of grand i10 nios at rs 8 40 lakh ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Hyndai Launches Cng Version Of Grand I10 Nios At Rs. 8.40 Lakh

Hyndai Grand i10 Niosలో CNG వెర్షన్‌ విడుదల, మైలేజ్ అదిరిపోయింది!

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 12:15 PM IST

హ్యుందాయ్ తాజాగా Grand i10 Niosలో CNG వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 8.45 లక్షలు. మరి ఈ కార్ ఫీచర్లు, మెలేజ్, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Grandi10 CNG
Grandi10 CNG

ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ తమ హ్యాచ్‌బ్యాక్ Grand i10 Niosలో ఇప్పుడు CNG వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ ఆప్షన్ టాప్-ఎండ్ మోడల్ అయినటువంటి గ్రాండ్ ఐ10 నియోస్ Astaలో లభించనుంది. ఎక్స్-షోరూమ్‌ వద్ద ఈ కొత్త వేరియంట్‌ ధర రూ. 8.45 లక్షలు. తాజా మోడల్ విడుదలతో కలిపి హ్యుందాయ్ ఇప్పుడు గ్రాండ్ i10లో మొత్తం మూడు CNG వేరియంట్‌లను కలిగి ఉంది. అంటే నియో మోడల్‌తో పాటు స్పోర్ట్స్, మాగ్నాలో కూడా CNG ఆప్షన్ ఉంది. Magna CNG ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా Sportz CNG ధర రూ. 7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

గ్రాండ్ i10 CNG టాప్-ఎండ్ వేరియంట్ మాగ్నాతో పోల్చితే Grand i10 Nios CNG ఆస్టా వేరియంట్‌ మరిన్ని ఎక్కువ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. ఆస్టా వేరియంట్‌లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు,15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ క్రోమ్ గార్నిష్ ఉన్నాయి. వెనకవైపు అద్దానికి వైపర్, వాషర్‌ కూడా ఉంటుంది.

క్యాబిన్ భాగంలో సరికొత్త Asta CNGలో లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్, పుష్ బటన్ స్టార్ట్ -స్టాప్‌తో కూడిన స్మార్ట్ కీ, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ కెపాసిటీ

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ Asta CNG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83ps శక్తిని 113nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. CNG లో నడుస్తున్నప్పుడు ఈ ఇంజిన్ 69 PS శక్తిని అలాగే 95.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. CNGలో ఆటోమేటిక్ ఆప్షన్ లేదు. ఈ గ్రాండ్ i10 Nios CNG వెర్షన్ 28km/kg మైలేజీని ఇస్తుందని హ్యుందాయ్ పేర్కొంది.

గ్రాండ్ i10 నియోస్ CNG వేరియంట్‌ మార్కెట్లో మారుతి ఆల్టో CNG, టాటా టియాగో CNG వంటి కార్లతో పోటీ పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్