World Best Dishes: ప్రపంచ బెస్ట్-100 జాబితాలో 4 భారతీయ వంటకాలు.. టాప్-50లో హైదరాబాద్ బిర్యానీ.. మిగిలినవి ఏవో ఊహించగలరా?
World Best Dishes: ఎంతో ఫేమస్ అయిన హైదరాబాదీ బిర్యానీకి మరో గుర్తింపు దక్కింది. ప్రపంచ బెస్ట్ వంటకాల లిస్టులో టాప్-50లో నిలిచింది. మొత్తంగా టాప్-100లో ఇండియా నుంచి నాలుగు డిషెస్‍కు చోటు దక్కింది.
హైదరాబాద్ బిర్యానీకి ఏ రేంజ్‍లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా దీన్ని ఎంతో మంది ఇష్టపడతారు. హైదరాబాద్ బిర్యానీని ఎంతో ప్రేమతో లాగించేస్తుంటారు. వరల్డ్ వైడ్‍గానూ ఈ బిర్యానీ పాపులర్ అయింది. ఇప్పుడు, హైదరాబాద్ బిర్యానీకి మరో గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ వెల్లడించిన ప్రపంచ బెస్ట్ వంటకాల జాబితాలో టాప్-50లో దీనికి ప్లేస్ లభించింది. దీంతో కలిపి టాప్ 100 లిస్టులో నాలుగు భారతీయ వంటకాలు ఉన్నాయి. ఆ వివరాలివే..
ఏ ర్యాంకుల్లో ఉన్నాయంటే..
2024కు గాను వరల్డ్ అట్లాస్ ప్రపంచ టాప్ 100 లిస్టులో ముర్గ్ మఖనీకి 29వ ప్లేస్ దక్కింది. హైదరాబాదీ బిర్యానీ 31వ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ రెండు టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. చికెన్ 65 డిష్ 97వ ప్లేస్‍లో నిలువగా.. 100వ స్థానంలో కీమా ఉంది. ఇలా టాప్-100లో నాలుగు భారతీయ వంటకాలు నిలిచాయి.
నాలుగు నాన్-వెజ్జే
ఈ ప్రపంచ బెస్ట్ 100 జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న నాలుగు వంటకాలు.. నాన్ వెజ్‍వే. శాకాహారం నుంచి ఏ ఇండియన్ వంటకానికి కూడా టాప్-100లో ప్లేస్ ఇవ్వలేదు వరల్డ్ అట్లాస్. పాపులర్ నాన్ వెజ్ వంటకాలకే చోటు దక్కింది.
ఈ జాబితాలోని హైదరాబాదీ బిర్యానీ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. రుచి, ఫ్లేవర్ నెక్స్ట్ లెెవెల్‍లో ఉంటాయి. నిత్యం కోట్లాది మంది ఈ హైదరాబాదీ బిర్యానీ తింటారు. చాలా మంది సెలెబ్రిటీలకు కూడా ఇది ఫేవరెట్ డిష్‍గా ఉంటుంది. కొందరు విదేశీయులు కూడా హైదరాబాదీ బిర్యానీపై ప్రశంసలు కురిపించారు. అంతలా ఈ బిర్యానీ ఆకట్టుకుంటూనే ఉంది.
ముర్గ్ మఖనీని బటర్ చికెన్ అని కూడా అంటారు. ఇది మసాలాలు, బటర్‌తో స్పైసీగా, డెలిషియస్‍గా ఈ వంటకం ఉంటుంది. ఎక్కువ మంది తినే వాటిలో ముర్గ్ మఖనీ కూడా ఒకటిగా ఉంటుంది.
చికెన్ 65 కూడా ఎంతో పాపులారిటీ ఉన్న వంటకం. రకరకాల మాసాలాలు, ఫ్లేవర్ల వెరైటీతో ఇది లభిస్తుంటుంది. క్రిస్పీగా, జ్యూసీగా, స్పైసీగా ఉంటుంది. ఇది కూడా ఎంతో ఫేమస్ అయింది. రెస్టారెంట్లలో, బండ్ల మీద రోజూ చాలా మంది దీన్ని తినేస్తుంటారు. కీమాను మటన్‍తో చేస్తారు. ఘాటుగా రుచికరంగా ఈ వంటకం ఉంటుంది. కీమాను చికెన్‍తోనూ చేస్తారు. మొత్తంగా టెస్ట్ అట్లాస్ టాప్-100 లిస్టులో భారత్ నుంచి నాలుగు వంటకాలకు ప్లేస్ దక్కింది.
టాప్-5 ఇవే
టేస్ట్ అట్లాస్ టాప్ 100 జాబితాలో తొలి మూడు స్థానాల్లో కొలంబాయాకు చెందిన లెచోనా, ఇటీలీకి చెందిన పిజ్జా నపోలెతానా, బ్రెజిల్ వంటకం పిచాన్హా నిలిచాయి. నాలుగు, ఐదు ప్లేస్‍లను రెచ్టా (అల్జీరియా), ఫనయెంగ్ కర్రీ (థాయ్‍లాండ్) దక్కించుకున్నాయి.
టాపిక్