Travel Guidance : హైదరాబాద్ టూ కోయంబత్తూరు.. బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్‍మెంట్ ఎక్కువ-hyderabad to coimbatore tour package is very low by train journey complete details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Travel Guidance : హైదరాబాద్ టూ కోయంబత్తూరు.. బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్‍మెంట్ ఎక్కువ

Travel Guidance : హైదరాబాద్ టూ కోయంబత్తూరు.. బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్‍మెంట్ ఎక్కువ

Anand Sai HT Telugu

Travel Guidance : అసలే వచ్చేది సెలవుల కాలం. నిజం చెప్పాలంటే.. అక్టోబర్‍లో చాలా సెలవులు వస్తున్నాయి. ఇంట్లోనే ఉండి బోర్ కొడితే టూర్ ప్లాన్ చేయండి. తక్కువ బడ్జెట్‍లో మీరు ఎక్కడి వెళ్లాలో HT Telugu మీకు గైడ్ చేస్తుంది.

ఈషా టూర్

అక్టోబర్ నెలలో చాలా సెలవులు ఉన్నాయి. దసరా సెలవులు కూడా కలిసి వస్తున్నాయి. కుటుంబంతో కలిసి వెళ్లి ఎంచక్కా ఎంజాయ్ చేసి రావొచ్చు. అలా అని లక్షలు పోసి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో మీరు మంచి మంచి ప్రదేశాలు చూడొచ్చు. కుటుంబంతో కలిసి పది.. పదిహేను వేలల్లో పక్క రాష్ట్రాల్లో సూపర్ ప్రదేశాలకు వెళ్లొచ్చు. అలా వెళ్లేందుకు సరైన ప్రదేశాల్లో ఒకటి తమిళనాడులోని కోయంబత్తూరు. ఇక్కడకు వెళ్తే ప్రకృతితో హాయిగా ఉండొచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మిమ్మల్ని మీరు వెతుక్కోవచ్చు. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం..

హైదరాబాద్ టూ ఈషా కోయంబత్తూరు వెళ్లేందుకు ప్లాన్ చేయండి. రౌండ్ ట్రిప్ కోసం ఒకరికి రూ.2300 వరకు అవుతాయి. రెండు రోజులు, ఒక నైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు శబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఉంటుంది. అది బుక్ చేసుకోవాలి. స్లీపర్ క్లాస్ కోసం టికెట్ ధర రూ.525గా ఉంటుంది. మీ బడ్జెట్ తక్కువ అవ్వాలంటే.. రైలులో కాకుండా.. మీ ఇంటి నుంచి ఏదైనా ఫుడ్ చేసుకుని తీసుకెళ్లండి. పిల్లలు ఉంటే ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేసుకోండి. ట్రైన్‍లో ఇంటి ఫుడ్ తింటే.. బడ్జెట్ ఇంకా తక్కువ అవుతుంది.

కేవలం 525 రూపాయలకే కోయంబత్తూరులో దిగుతారు. స్టేషన్ నుంచి బయటకు రాగానే.. ఎడమవైపు బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రతీ 30 నిమిషాలకు ఓ బస్ ఉంటుంది. మీరు అందులో నేరుగా వెళ్లొచ్చు. బస్ లో వెళ్తుంటే కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. 14డి అనే బస్ ఎక్కాలి, టికెట్ ధర రూ.40 రూపాయలుగా ఉంటుంది. వెళ్లేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. నేరుగా ఈషా ఎంట్రెన్స్ దగ్గర డ్రాప్ చేస్తారు.

ఇక అక్కడ ఉండేందుకు ఈషాలో రూమ్స్ దొరుకుతాయి. మీకు కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు. ఒక రోజు ఉండేందుకు 990 రూపాయల నుంచి రూమ్స్ ఉంటాయి. ఇద్దరూ స్టే చేయోచ్చు. స్టే బుక్ చేసుకుంటే వన్ టైమ్ లంచ్, డిన్నర్ ఫ్రీగా ఉంటుంది. రాత్రి అంతా పడుకుని.. తెల్లారి ఈషా మెుత్తం తిరగొచ్చు. మీరు యోగా కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో మీకు హాయిగా అనిపిస్తుంది.

ఇక మీకు టైమ్ ఉంటే దగ్గరలో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతితో గడపొచ్చు. ఈషా నుంచి 17 కిలోమీటర్ల దూరంలో సిరువాని వాటర్ ఫాల్స్ ఉంటాయి. చూసేందుకు బాగుంటుంది. హైదరాబాద్ రిటర్న్ వచ్చే సమయంలో ఇది కూడా కవర్ చేసుకోవచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లొచ్చు.. లేదంటో సింగిల్‍గా కూడా మీరు వెళ్లి రావొచ్చు.