కరాచీ బేకరీలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ బేకరీలను 1953 విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చిన ఒక సింధీ హిందూ కుటుంబం వారు హైదరాబాదులో స్థాపించారు. ఈ బేకరీలలో ఫ్రూట్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు, దిల్ కుష్ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ తో పాటు, కరాచీ బేకరీకి బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా అవుట్ లెట్ లు ఉన్నాయి.
కరాచీ ఫ్రూట్ బిస్కెట్లు కరాచీ నుండి వచ్చాయని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ బిస్కెట్ హైదరాబాదులోని ప్రసిద్ధ కరాచీ బేకరీ ప్రత్యేకమైన ఉత్పత్తి. ఈ కరాచీ బిస్కెట్లను గుడ్లు వాడకుండా ఇంట్లోనే తయారు చేయవచ్చు.
గోధుమపిండి - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
కస్టర్డ్ పౌడర్ - 70 గ్రాములు
టూటీ ఫ్రూటీ - 60 గ్రాములు
పాలు - అయిదు స్పూన్లు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
పైనాపిల్ ఎసెన్స్ - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బటర్ - పావు కప్పు
1. వెడల్పాటి గిన్నెలో ఉప్పు, కొంచెం బటర్, పైనాపిల్ ఎసెన్స్, పాలు, పంచదార వేసి కలపాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి
2. ఇప్పుడు మరో గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బటర్ వేసి కలపాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి.
3. ఇవన్నీ కలిపిన తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్, టూటీ ఫ్రూటీ తీసుకోవాలి. అన్ని పదార్థాలను బాగా కలపాలి.
4. ఇప్పుడు పాల మిశ్రమాన్ని ఈ పిండి కలిపిన మిశ్రమంలో కలుపుకోవాలి.
5. అన్ని పదార్థాలను మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా గిలక్కొట్టుకోకూడదు.
6. ఇప్పుడు మొత్తం పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచాలి. పిండిని చపాతీ ఆకారంలోకి చుట్టి ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచాలి.
7. ఓవెన్ ను 180 డిగ్రీల సెల్సియస్ కు ప్రీ హీట్ చేయాలి.
8. ఇప్పుడు పిండిని తీసుకుని చేత్తోనే బిస్కెట్లలో ఒతుకోవాలి. వాటిని బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ వేసి వాటిని ఉంచాలి.
9. ఈ బిస్కెట్ల మధ్య కొంత ఖాళీ ఉండేలా చూసుకోండి. ఈ కుకీలను ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టాలి.
10. పావుగంట సేపు ఓవెన్లో ఉంచాలి. ఆ తరువాత తీస్తే కరాచీ బిస్కెట్లు సిద్ధమైనట్టే.
నిజానికి ఈ కుకీలను తయారు చేయడం చాలా సులభం. ఈ కరాచీ బిస్కెట్లు కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే తక్కువ ధరకే పూర్తవుతాయి. పైగా శుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
టాపిక్