హైదరాబాద్‌లోని హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెకండరీ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంస్థ దరఖాస్తులను కొరుతుంది. ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ వరుకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తులకు మార్చ్ 22, 2022 చివరి తేది.
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
,
ప్రైమరీ స్కూల్ టీచర్ - 04, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - సైన్స్ - 01, ట్రెయిన్డ్ గ్రా, డ్యుయేట్ టీచర్ - సోషల్ - 01, డాన్స్ టీచర్ - 01,మ్యూజిక్ టీచర్ - 01, కౌన్సెలర్ - 01, అడ్మినిస్ట్రేటీవ్ సపోర్టీవ్ క్లర్క్ - 01, నర్సరీ టీచర్ - 01, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - ఫీమెల్ - 01, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ - 01
దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://halsecondaryschoolhyderabad.in వెళ్ళి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. తర్వాత దరఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకుని నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి.
The Principal,
HAL Secondary School,
HAL Township,
Balanagar,
Hyderabad-500042 అడ్రస్‌కు పోస్ట్ చేయాలి. దరఖాస్తులకు చివరి మార్చ్ 22, 2022 . అభ్యర్థి వయసు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
సంబంధిత కథనం