Smoking and Pregnancy: ప్రెగ్నెన్సీలో మహిళలు స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది? ఓ అధ్యయనం ఫలితాలివే-how women smoking in pregnancy effects infants health says study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smoking And Pregnancy: ప్రెగ్నెన్సీలో మహిళలు స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది? ఓ అధ్యయనం ఫలితాలివే

Smoking and Pregnancy: ప్రెగ్నెన్సీలో మహిళలు స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది? ఓ అధ్యయనం ఫలితాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 01, 2024 12:30 PM IST

Smoking and Pregnancy: గర్భధారణకు ముందు, మొదటి మూడు నెలలు గర్భధారణ సమయంలోనూ తేలిక పాటి ధూమపానం ప్రమాదకరం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ ధూమపానం ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఎలా ఉంటుందో కొత్త పరిశోధన స్పష్టంగా చెబుతోంది.

గర్భధారణ సమయంలో స్మోకింగ్
గర్భధారణ సమయంలో స్మోకింగ్ (Pexels)

మీ చుట్టూ తెలీకుండానే చాలా మంది మహిళలకూ రహస్యంగానో, సందర్బాన్ని బట్టో స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. చాలా మంది గర్భం ధరించిన వెంటనే ధూమపానం అలవాటున్నా మానేస్తారు. ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద గర్భవతిగా ఉన్నప్పుడు ధూమపానం చేయవద్దనే హెచ్చరిక రాసి ఉంటుంది. కానీ గర్భధారణ సమయంలోనూ ధూమపానానికి ఏదైనా 'సురక్షిత కాలం' ఉందా? గర్భధారణకు ముందే ధూమపానం మానేయాలా? ఈ ప్రశ్నలన్నింటికీ ఓ కొత్త అధ్యయనం సమాధానమిస్తోంది.

సురక్షిత సమయం అంటూ లేదు:

చైనాలో జర్నల్ ఆఫ్ ఎపిడీమాలజీ, కమ్యూనిటీ హెల్త్ ప్రచురించిన పరిశోధన మహిళల్లో స్మోకింగ్ ప్రభావం గురించి చెబుతోంది. గర్భధారణకు ముందు తేలికపాటి స్మోకింగ్ చేయడం (రోజుకు ఒకటి లేదా రెండు సిగరేట్లు) కూడా పుట్టబోయే బిడ్డ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ పరిశోధన చెబుతోంది. అలాగే కడుపులో బిడ్డ పెరుగుతున్న ఏ సమయంలోనూ స్మోకింగ్ చేయడం మంచిది కాదని ఈ పరిశోధన మరోసారి స్పష్టంగా నొక్కి చెప్పింది. కాబట్టి గర్భధారణ కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నప్పుడే ఈ అలవాటును మానుకోవాలని చెబుతోందీ ప్రచురణ.

స్మోకింగ్
స్మోకింగ్ (Unsplash)

2016-2019 మధ్య యూఎస్ నేషనల్ వైటల్ స్టాటిస్టిక్స్ విధానం లోని జనన ధృవీకరణ పత్రాల డేటాను ఈ అధ్యయనం సేకరించింది. పరిశోధకులు 12,150,535 మంది తల్లి-నవజాత శిశువుల వివరాలను, రోజుకు తాగే సిగరెట్ల సంఖ్య డేటాను విశ్లేషించారు. వీళ్లలో రోజుకు కాల్చే సిగరెట్ల సంఖ్య 0 నుండి 20 వరకు ఉందట. గర్భధారణ అన్ని దశలలో ధూమపానానికి దూరంగా ఉండాలని వారి పరిశోధన చెబుతోంది. అలాగే గర్భధారణ మొదటి మూడు నెలల్లో, గర్భవతి కావడానికి ముందు తేలికపాటి ధూమపానం అంత హానికరం కాదనే అపోహను ఈ పరిశోధన ద్వారా తొలిగించారు.

ధూమపానం ఆరోగ్య ప్రభావాలు

గర్భధారణ సమయంలో ధూమపానం ఆరోగ్య ప్రభావాలను తెలియజేసే అనేక పరిశోధనలు ఇప్పటికే ఉన్నాయి. పిల్లలు నెలలు నిండకముందే పుట్టడం, లేదా తక్కువ బరువుతో పుట్టడం, గర్భంలో పిండం అభివృద్ధి మీద ధూమపానం ప్రభావం చూపుతుందని ఇవి చెబుతున్నాయి. వీటి మీద సరైన అవగాహన లేక చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీలోనూ ధూమపానం చేయడం సాధారణ విషయంగా పరిగణిస్తున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంల స్మోకింగ్ గురించి అధ్యయనం
ప్రెగ్నెన్సీ సమయంల స్మోకింగ్ గురించి అధ్యయనం (Unsplash)

అధ్యయనంలో ఏం తేలింది?

“ధూమపానం చేసిన మహిళలకు జన్మించిన నవజాత శిశువులకు పుట్టిన వెంటనే వెంటిలేషన్ అధికంగా అవసరం పడుతుంది. 6 గంటలకు పైగా సహాయకుల ఆధ్వర్యంలో వెంటిలేషన్ , లేదా మెకానికల్ వెంటిలేషన్ కోసం ఎన్‌ఐసీయూ లో చేర్చాల్సిన పరిస్థితులు ఇలా పుట్టిన పిల్లలకు ఉన్నాయి.” అని ఈ పరిశోధన చెబుతుంది. వీటితో పాటే మూర్ఛ రోగం, మెదడులో సమస్యలు లాంటివి వచ్చే ప్రమాదమూ ఉందట.

గర్భధారణకు ముందు ధూమపానం చేయడం వల్ల కూడా నవజాత ఆరోగ్య సమస్యలకు 27 శాతం ఎక్కువ ప్రమాదాన్ని కలగజేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి ఎప్పుడైనా ధూమపానం చేస్తే ఈ ప్రమాదం 31 శాతం నుండి 32 శాతం వరకు ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు కూడా రోజుకు 1 నుంచి 2 సిగరెట్లు తాగడం వల్ల కూడా నవజాత శిశువుల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. రోజుకు 20 లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు తాగితే ప్రమాదం 31 శాతానికి పెరుగుతుంది

టాపిక్