Emotional trigger: భావోద్వేగాల ఉప్పెన ముంచెత్తుతోందా? ఈ థెరపిస్ట్ మాటలు వినండి
Emotional trigger: భావోద్వేగాల ఉప్పెనలో అందరికీ దూరం అవుతున్నారా? ఈ థెరపిస్ట్ సూచనలు అనుసరించండి.
తరచుగా మనం ఏదో ఒక అంశం వల్ల రియాక్ట్ అవుతుంటాం. ఆ అంశాన్నే ట్రిగ్గర్ అంటాం. అలాంటి అంశాల కారణంగా మనం రియాక్ట్ అవడమో, ప్రవర్తించడమో చేస్తూ భవిష్యత్తులో చింతిస్తుంటాం. అలా రియాక్ట్ అయినప్పుడు అందరికీ దూరమై పోతుంటాం. తిరస్కరణకు గురవుతుంటాం. అలాంటి భావోద్వేగాల స్పందనకు కారణమయ్యే ట్రిగ్గర్లను మేనేజ్ చేయడం ఎలాగో నేర్చుకోవడం కూడా అవసరం.
ట్రెండింగ్ వార్తలు
దీనిని సైకాలజిస్ట్ నికోల్ లెపెరా వివరించారు. ‘ప్రతి వ్యక్తికి అలాంటి ట్రిగ్గర్లు ఉంటాయి. అది మానవ అనుభవంలో ఒక భాగం. అయితే ఆ ట్రిగ్లర్లను మేనేజ్ చేయడం ఎలాగో నేర్చుకుంటే మన జీవితం, రిలేషన్‌షిప్స్ మారిపోతాయి..’ అని వివరించారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ చెప్పడంలో ఆమెకు బాగా పేరుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అంశాలను వివరించారు. ఎమోషనల్ ట్రిగ్గర్స్ మేనేజ్ చేయడం గురించి సూచనలు చేశారు.
ఎమోషనల్ ట్రిగ్గర్ అంటే ఏంటి?
ఇప్పటికీ మనల్ని బాధపెట్టే గత అనుభవాలు మనందరికీ ఉన్నాయి. ఆ గాయాలను మళ్లీ రేపే సంఘటనలు, సందర్భాలూ తరచూ అనుభవిస్తుంటాం. మనలో భావోద్వేగాలు ఉప్పెనలా లేస్తాయి. వాటికి మనం ప్రతిస్పందించాల్సి వస్తుంది. గతం వర్తమానంలో ఉందని భావించడం వల్ల ఇలా జరుగుతుంది. ఆ పాత రోజులకు వెళ్లి రియాక్ట్ అవుతుంటాం. పిల్లల్లా ప్రవర్తిస్తుంటాం. ఆ గాయంలోకి జారుకుంటాం..
ట్రిగ్గర్స్ ఎన్ని రకాలు
మనం ఎలా ఉన్నామో విమర్శలకు గురైనప్పుడు లేదా ఏదో ఒకదాని కోసం ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు అవి మనకు ట్రిగ్గర్లలా పనిచేస్తాయి. ఇవి వ్యక్తిగత అనుభవం ద్వారా కలిగేవి. వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటాయి. కోపంలో, బాధలో ఉన్న వ్యక్తిని చూడడం లేదా దేనికోసమైనా విచారంలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అవి ట్రిగ్గర్లలా పనిచేస్తుంటాయి. నియంత్రణకు గురవడం, ఏదైనా చేయాలని ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తున్న భావన కలిగి ఉండడం కూడా ట్రిగ్గర్లే అవుతాయి.
ఈ ట్రిగ్లర్లను ఎలా మేనేజ్ చేయాలి
పోరాడడం, పారిపోవడం, స్తంభించిపోవడం, సొంత క్షేమం మానుకుని ఇతరులను సంతోషపెట్టడం వంటి స్పందనలకు శరీరం గురవుతుంది. ఆయా ట్రిగ్లర్లకు నాడీ వ్యవస్థతో కలిసి శరీరం కొన్ని నిర్ధిష్ట మార్గాల్లో స్పందిస్తుంది. ట్రిగ్లర్లు మనల్ని మానసికంగా ముంచెత్తుతాయి. ప్రతిస్పందనను చిత్రీకరించే ముందు దానిని నిర్ధారించడం కష్టమవుతుంది. అయితే ఈ ట్రిగర్లను మేనేజ్ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఉత్సుకతను కలిగి ఉండడం: ట్రిగ్గర్లు ఎదురైనప్పుడు మనం ఎదుర్కొంటున్న భావోద్వేగాలను తెలుసుకోవడం ప్రారంభించాలి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి.
ఆగిపోవాలి: ఏదైనా ప్రతిస్పందన చూపే ముందు ఒకసారి పాజ్ తీసుకుని మీరు ట్రిగ్గర్‌కు లోనవుతున్నారని బిగ్గరగా అనండి. అప్పుడు ఒకసారి ఊపిరి తీసుకోవడానికి, స్పందించడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నారని చెప్పండి.
మీకు మీరే ఓదార్పు: మీ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మార్చే కొన్ని పనులు చేయండి. నడవడమో, ఏడవడమో లేదా జర్నల్‌లో రాయడమో చేయండి.
రెస్పాండ్ అవ్వండి: రియాక్ట్ అవడానికి బదులు రెస్పాండ్ అవ్వండి. మీ పరిణితి చెందిన వ్యక్తిత్వం ప్రస్తుత సందర్బానికి రెస్పాండ్ అయ్యేలా చూడండి.
సంబంధిత కథనం