Soap Nuts For Hair : కుంకుడు కాయలు వాడితే.. అందమైన జుట్టు మీ సొంతం!-how to use soap nuts for hair hair loss prevention hair growth tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Use Soap Nuts For Hair Hair Loss Prevention Hair Growth Tips

Soap Nuts For Hair : కుంకుడు కాయలు వాడితే.. అందమైన జుట్టు మీ సొంతం!

HT Telugu Desk HT Telugu
Aug 29, 2023 02:00 PM IST

Soap Nuts For Hair : జుట్టు సంరక్షణకు కుంకుడు కాయలు వాడటం పురాతన కాలం నుంచి ఉంది. కుంకుడు కాయలను వెంట్రుకలు ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..

కుంకుడు కాయలు
కుంకుడు కాయలు (unsplash)

చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలడం(Hair Loss). వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలుతోంది. ఈ సమస్యను అనేక ఎదుర్కొంటున్నారు. దీంతో ఒక్కోసారి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. జుట్టు రాలడానికి తీసుకునే ఆహారంతోపాటు.. వాడే షాంపూలు కూడా ముఖ్య కారణం. కెమికల్స్ ఉన్న జుట్టు ఉత్పత్తులు(Hair Products) వాడటంతో చాలా మంది జుట్టు రాలిపోతుంది. తర్వాత ఏం చేసినా ఫలితం ఉండటం లేదు. పూర్వకాలంలో తలస్నానం చేసేందుకు కుంకుడు కాయలను(Soap Nuts) ఉపయోగించేవారు.

ట్రెండింగ్ వార్తలు

కుంకుడు కాయలను దంచి, నానబెట్టి వాటి నుంచి రసాన్ని తీసి తలస్నానం చేసేవారు. దీంతో జుట్టు చాలా అందంగా ఉండేది. వీటిని ఉపయోగించడం వలన.. జుట్టు మురికి కూడా పోతుంది. ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవు.. సహజ సిద్ధంగా దొరుకుతుంది కాబట్టి.. జుట్టుకు హాని కలగదు. ప్రస్తుతం దొరుకుతున్న షాంపూలకంటే.. కుంకుడు కాయలను ఉపయోగించడం చాలా మేలు.

మార్కెట్లో దొరికే.. షాంపులను ఉపయోగిస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఇందులో నిజమేంతో తెలియదు.. కానీ.. వీటి ద్వారా నష్టాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. షాంపులో నురుగ రావాలంటే.. కెమికల్స్ ఉపయోగిస్తారు. దీంతో కొద్దిగా రుద్దగానే నురగ వస్తుంది. కానీ మురికి మత్రం అలాగే ఉంటుంది. ఇందులోని రసాయనాలతో జుట్టు విరిగిపోవడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే సహజ సిద్ధంగా దొరికే కుంకుడు కాయలను వాడితే మంచిది.

అయితే కొంతమంది కుంకుడు కాయలను వాడితే కళ్ల మంట వస్తుంది.. ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుని కుంకుడు కాయలను ఉపయోగించాలి. వీటని వాడితే.. చుండ్రు సమస్యలు(Dandruff Problems) తగ్గుతాయి. తలలో చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పోతాయి. పేల సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. జుట్టు కుదుళ్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కుంకుడు కా

కుంకుడు కాయలను పొడిగా దంచాలి. లోపల ఉండే.. నల్లటి పెంకులు తీసి పాడేయాలి. తర్వాత ఎండబెట్టాలి. వీటిని జార్ లో వేసి .. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని జల్లెడ పట్టి.. నిల్వ చేయాలి. దీనిని నేరుగా జుట్టుపై వేసి వాడుకోవచ్చు. వేడి నీటిలో వేసి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది పెట్టుకునేప్పుడు మాత్రం కళ్లు మూసుకోవాలి. కళ్లలోకి పోతే మంటగా ఉంటుంది. షాంపూలకు బదులు కుంకుడు కాయలను ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

WhatsApp channel