Guava Leaves Benefits : జామ ఆకులతో బరువు తగ్గడం ఎలా?
Weight Loss With Guava Leaves : శరీర బరువును తగ్గించేందుకు జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
జామ పండు రుచి అందరికీ ఇష్టమే. తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో జామ ఒకటి. బరువు తగ్గడం(Weight Loss) నుండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం వరకు, జామ పండు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఈ పండు ఆకులను తీసుకోవడం లేదా ఈ ఆకుల నుండి టీ తయారు చేయడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
జామ ఆకుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం(Heart Health) కూడా మెరుగుపడుతుంది. జామ ఆకులను అనేక వ్యాధులకు సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు.
జామ ఆకు టీ(Guava Leaves Tea) తయారు చేయడం లేదా జామ ఆకులను తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
జామ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
జామ ఆకులు బరువు తగ్గడానికి(Guava Leaves For Weight Loss) దోహదపడతాయని ఏ శాస్త్రీయ అధ్యయనమూ నిర్ధారించలేదు. కానీ మీరు చక్కెర పానీయాలకు బదులుగా హెర్బల్ టీ తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఉదయం పూట జామ ఆకు టీతో సహా తియ్యని హెర్బల్ టీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
జామ ఆకు టీ చేయడానికి 5 నుండి 10 జామ ఆకులను కడగాలి. ఒక పాత్రలో కావలసినంత నీరు పోసి బాగా మరిగించాలి. అందులో కడిగిన జామ ఆకులను వేసి 5 నిమిషాలు మరిగించాలి. రంగు, రుచి కోసం ½ టీస్పూన్ టీ పౌడర్ జోడించండి. 10 నిమిషాలు మరిగిన తర్వాత వడకట్టుకోవాలి. తీపి రుచి కావాలంటే తేనె లేదా బెల్లం జోడించవచ్చు.
జామ ఆకులను ఉపయోగిస్తే.. జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. వీటిలో విటమిన్ సి(Vitamin C), యాంటి ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు దాగి ఉంటాయి. జామ ఆకుల రసం తాగినా.. వాటితో టీ(Tea) తయారు చేసుకుని.. తాగినా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కరె స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఫుడ్ తిన్నాక.. జామ ఆకుల టీ(Guava Leaves Tea)ని తాగితే చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. టీని చాలా సులభంగా తయరు చేయోచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేసుకోవాలి. ఇందులో 4 జామ ఆకులను శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టాలి. ఇలా చేస్తే.. జామ ఆకుల టీ తయారు అవుతుంది.