జుట్టు సంరక్షణ(Hair Care) కోసం చాలా మంది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ మీద ఆధారపడతారు. కానీ ఈ సౌందర్య సాధనాలన్నీ వివిధ రసాయన పదార్థాలను కలిగి ఉంటాయి. దీని వల్ల రకరకాల జుట్టు సమస్యలు(hair problems) కనిపిస్తాయి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇంట్లోని వస్తువుల సహాయం తీసుకోవచ్చు. మీరు కాఫీతో త్వరగా సిల్కీ, మృదువైన జుట్టును పొందవచ్చు. జుట్టు సంరక్షణలో కాఫీని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
కాఫీతో జుట్టు(Coffee For Hairs) కడగాలి. అంటే పేస్ట్ చేయడానికి కాఫీ పొడిలో తగినంత వేడి నీటిని కలపండి. పేస్ట్ చల్లగా ఉన్నప్పుడు, మొత్తం తలపై పట్టించాలి. కాసేపు మసాజ్ చేసి.. 10-15 నిమిషాలు అలాగే ఉంచి తల కడుక్కోవాలి. కాఫీలోని కెఫిన్ స్కాల్ప్‌కి రక్త ప్రసరణను పెంచుతుంది. స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఫలితంగా వెంట్రుకలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
ఒక కప్పు కాఫీ చేసి చల్లారనివ్వాలి. ముందుగా జుట్టుకు షాంపూ వేయండి. తర్వాత చల్లారిన కాఫీని మీ తలపై పోయాలి. కాసేపు అలాగే ఉండనివ్వండి. కాఫీలోని ఆమ్లత్వం స్కాల్ప్ యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చుండ్రును(Dandruff) తొలగిస్తుంది. జుట్టు మెరుపును కూడా పెంచుతుంది.
2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌లో 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను బాగా కలపండి. హ్యాండ్ లేదా బ్రష్ సహాయంతో ఈ హెయిర్ మాస్క్‌ను రూట్ నుంచి అప్లై చేయండి. అరగంట పాటు మీ జుట్టును షవర్ క్యాప్‌తో కప్పండి. తర్వాత కడగండి. కాఫీ, తేనె, కొబ్బరి నూనెతో కూడిన ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.
ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, అరకప్పు పుల్లటి పెరుగు, 3 టీస్పూన్ల నిమ్మరసం కలిపి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని జుట్టు మూలాలకు పట్టించి ఆరనివ్వండి. తర్వాత షాంపూతో స్నానం చేయాలి.
జుట్టు రాలే సమస్యను(Hair Fall) చాలా మంది ఎదుర్కొంటున్నారు. మంచి జుట్టు పొందడానికి కాఫీ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని కాఫీ పొడితో బాగా కలపండి. ఈ హెయిర్ ప్యాక్‌ని షాంపూ చేసిన తర్వాత తడి జుట్టు మీద అప్లై చేయండి. కొంత సమయం తర్వాత మీ తలను కడగాలి. ఇలా కాఫీతో జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.