Buttermilk For Hair : జుట్టు పెరుగుదలకు మజ్జిగ మంచిదేనా? ఎలా వాడాలి?
Butter Milk For Hair : ముఖ సౌందర్యానికి ఎంత విలువ ఇస్తామో.. జుట్టు ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ స్టైల్ మధ్య జుట్టు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లేదు. దాంతో జుట్టు ఆరోగ్యం పాడవుతోంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
జుట్టు బలంగా లేకపోవటం, చుండ్రు(Dandruff) కనిపించడం, చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యలు శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల లేదా మనం జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవడం వల్ల జరుగుతుంది. అయితే ఇంట్లోనే చిట్కాలు పాటించి.. జుట్టును సంరక్షించుకోవచ్చు. మజ్జిగ వాడితే సరిపోతుంది.
మజ్జిగ శరీరానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, కొవ్వు, లాక్టిక్ యాసిడ్ వంటి మంచి పదార్థాలు కూడా ఉన్నాయి. కడుపులో మంటగా ఉన్నప్పుడు శరీరం చల్లగా ఉండేందుకు మజ్జిగను వాడడం సర్వసాధారణం. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ భోజనానికి మజ్జిగనే ఉపయోగిస్తారు. మీకు మజ్జిగ తినడం ఇష్టం లేకపోతే మీ జుట్టు(Butter Milk To Hair)కు దీన్ని ఉపయోగించవచ్చు.
మజ్జిగతో మీ జుట్టును కాపాడుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు(Hair Growth) ఉపయోగపడే సహజ పదార్థాలలో మజ్జిగ ఒకటి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. అంటే స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, ఆరోగ్యకరమైన వాతావరణంలో జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే ప్రొటీన్‌లు వెంట్రుకలను కూడా రక్షిస్తాయంటే నమ్మాల్సిందే.
మజ్జిగను బయటి నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే తయారుచేసుకుని జుట్టుకు వాడితే మంచిది. మజ్జిగను జుట్టుకు రాసుకుంటే నీళ్లు రాసుకున్న అనుభూతి కలుగుతుంది. ఇది అప్లై చేసిన తర్వాత, బాగా మసాజ్ చేసి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. మజ్జిగను మీ జుట్టుకు బాగా పట్టించి, మీ వేళ్లతో తలకు మసాజ్ చేయాలి. మజ్జిగ రాస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శక్తివంతం చేయడంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
మీ స్కాల్ప్, హెయిర్ ను బాగా మసాజ్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇది జుట్టు నుండి కిందికి కారుతుంది. తల చుట్టూ షవర్ క్యాప్ లేదా టవల్ చుట్టుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో జుట్టును బాగా కడగాలి. మజ్జిగలో ఉండే ఆయిల్ కంటెంట్ జిగటగా అనిపిస్తుంది. మీ జుట్టును బాగా కడగాలి. కడిగిన తర్వాత మీకు కావాలంటే మీకు ఇష్టమైన కండీషనర్‌ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత శుభ్రమైన టవల్ తో జుట్టును బాగా ఆరబెట్టండి.
మజ్జిగను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు హాని కలగదు. అయితే పాలు లేదా మజ్జిగతో అలెర్జీ ఉంటే వేరే పద్ధతులను పాటించండి. ఇలా నిత్యం మజ్జిగను జుట్టుకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు(Hair) బలంగా పెరుగుతుంది, మెరుస్తుంది. మజ్జిగ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే వారంలో ఒక్కసారైనా మజ్జిగను బాగా అప్లై చేసి జుట్టుకు మసాజ్ చేస్తే మీ జుట్టు ఎంత దృఢంగా ఉంటుందో చూడండి.