వైట్ షర్టు లేదా వైట్ టీ షర్టు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కొన్ని రోజులు వాడిన తర్వాత అవి వేసుకోవాలంటే బోర్ కొట్టేస్తోంది. దాన్ని కొత్తగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. మీ పాత టీ షర్టుకు ఇంద్రధనస్సు రంగులను జోడిస్తే అది కొత్తగా కనిపిస్తుంది. పైగా అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే వైట్ టీషర్టును రంగుల టీషర్టుగా ఎలా మార్చాలో చూద్దాం.
తెల్ల పాత టీ షర్టు ను రంగుల టీ షర్ట్ గా మార్చే చిట్కాను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే మీరు ప్లెయిన్ షర్టును కొత్త టీ షర్టుగా మార్చేయగలరు. ఇలా మార్చడం కూడా చాలా సులువు. ముఖ్యంగా అమ్మాయిలా క్రాప్ టాప్, టీషర్టులను రంగురంగుల పూలతో ఆకులతో కలర్ ఫుల్ గా మార్చే చిట్కా ఇక్కడ ఉంది.
ఫ్యాషన్ ఇన్ ఫ్లూయెన్సర్ ఏక్తా మాలవ్యా ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె తన వైట్ కలర్ టాప్‌కు సరికొత్త రూపాన్ని ఇచ్చింది. సాదా తెల్లటి టీ షర్టు లేదా క్రాప్ టాప్ ను తాజా పువ్వులు, ఆకులతో కొత్తగా మార్చుకుంది. దాన్ని చూస్తే ఎవరికైనా సరే నచ్చేలా ఉంది.
ఇక ఆమె బయట టీ షర్టును ఎలా మార్చిందో తెలుసుకుందాం. దీనికోసం ఆమె మందార పువ్వులు, పసుపు రంగు పువ్వులు, గులాబీ పువ్వులు, ఆకుపచ్చని ఆకులు, శంఖం పుష్పాలను తీసుకుంది. వైట్ టీ షర్ట్ ను పరిచి దానిపై అక్కడక్కడ ఈ పువ్వులను అలంకరించింది. అలాగే ఆకులను కూడా అక్కడక్కడ పెట్టింది. ఇప్పుడు సుత్తితో ఆ పువ్వులను ఆకులను గట్టిగా మోదింది.ఆ ఆకుల రంగు అదే ఆకారంలో టీషర్టుకు అతుక్కుంది. ఆ రంగును కూడా టీ షర్టు పీల్చుకుంది. ఇప్పుడు ఆ టీ షర్టును ఎండబెట్టి దాన్ని వేసుకుంది. ఇది ఎంతో ట్రెండీగా ఉంది. రియల్ ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు.
ఇంత సింపుల్‌గా, కలర్ ఫుల్‌గా మార్చిన హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ రీల్ దాదాపు నాలుగు లక్షల మంది పైగా చూశారు.
కేవలం ఈ పద్ధతిలోనే కాదు టై అండ్ డై టెక్నిక్ ద్వారా కూడా మీ తెల్లటి టీ షర్టును కొత్తగా మార్చుకోవచ్చు. ఇందుకు ముందుగా టీ షర్ట్ ను తడిపి గట్టిగా పిండాలి. తర్వాత దాన్ని మడిచి రబ్బర్ బ్యాండ్లతో బిగించి కట్టాలి. ఇప్పుడు మీకు నచ్చిన రంగులను స్ప్రే బాటిల్ లో వేసి ఆ టీషర్ట్ పై స్ప్రే కొట్టాలి. తర్వాత దాన్ని ఎనిమిది గంటల పాటు అలా వదిలేయాలి. తర్వాత రబ్బర్ బ్యాండ్ లు తీసి ఆరబెట్టాలి. టై అండ్ డై డిజైన్ టీ షర్టు రెడీగా ఉంటుంది.
అలాగే పెయింట్ ద్వారా కూడా పాత తెల్లటి టీ షర్ట్ ను డిజైనర్ వేర్ గా మార్చుకోవచ్చు. మీకు ఫ్యాబ్రిక్ పెయింట్ వేయడం వస్తే ఈ ఆధునిక కళతో మీ వైట్ టీ షర్టుపై రకరకాల డిజైన్లు వేయండి. వేశాక ఒక రోజు పాటు దాన్ని అలాగే ఆరనివ్వండి. ఆ తర్వాతే ధరించేందుకు ప్రయత్నించండి.