Masturbation Stop Tips : హస్తప్రయోగం వ్యసనంగా మారిందా? ఎలా వదిలించుకోవాలి?
Masturbation Stop Tips : హస్తప్రయోగం మీ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది మీకు చెబుతారు. ఎందుకంటే ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ, నిజం ఏంటంటే, హస్త ప్రయోగం ఒక వ్యసనంగా మారితే మానసికంగా, శారీరకంగా చాలా బాధపడతారు. అందుకే ఏది కూడా అతిగా చేయెుద్దు.
అధ్యయనాల ప్రకారం, మీరు వారానికి మూడు నుండి ఐదుసార్లు హస్త ప్రయోగం చేసుకోవచ్చు. కానీ హస్తప్రయోగం రోజుకు రెండు మూడు సార్లు చేసుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఈ చర్యను అతిగా చేస్తే అది వ్యసనంగా మారుతుంది. మితిమీరిన హస్త ప్రయోగం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో జననేంద్రియాలలో కురుపులు ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
హస్తప్రయోగం అధికంగా ఉన్నప్పుడు, పురుష శరీరానికి స్పెర్మ్ ఉత్పత్తి చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే క్రమం తప్పని హస్తప్రయోగం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, అధిక హస్త ప్రయోగం అకాల స్ఖలనానికి దారి తీస్తుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఈ హస్తప్రయోగ వ్యసనానికి గురైనట్లయితే, దాని నుండి విజయవంతంగా బయటపడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. హస్త ప్రయోగం నుండి బయటపడటానికి, లైంగికంగా ప్రేరేపించే వస్తువులను దూరంగా పెట్టాలి. ఆసక్తిని రేకెత్తించే విషయాలను విస్మరించాలి. అధిక హస్తప్రయోగాన్ని వదిలించుకోవడానికి ఆరోగ్యకరమైన కొత్త అభిరుచిని ఎంచుకోవాలి. హస్తప్రయోగం నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మీరు కొత్త విషయాలు లేదా ఆలోచనలపై ఆసక్తిని కనబరచడం ప్రారంభించినట్లయితే, అది మిమ్మల్ని అధిక హస్తప్రయోగం నుండి సులభంగా బయటపడేలా చేస్తుంది. కొత్త అభిరుచిని ఎంచుకోవడం వలన మీ మనస్సు హస్తప్రయోగం చేయాలనే ఆలోచన నుండి బయటపడుతుంది. కొత్త అభిరుచిపై మరింత దృష్టి పెడుతారు. స్విమ్మింగ్, వ్యాయామం, బాడీబిల్డింగ్ వంటి కొత్త హాబీలను మెుదలుపెట్టండి.
ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించే క్రీడలలో మునిగిపోండి. సాకర్, త్రోబాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలను ఎంచుకోవచ్చు. ఈ క్రీడలు మిమ్మల్ని ఫిట్‌గా, దృఢంగా ఉంచుతాయి. హస్తప్రయోగం నుండి బయటపడటానికి సులభమైన మార్గాలలో ఒకటి ఒంటరిగా ఉండకపోవడం. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు అలాంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. అవే ఆలోచనలు వస్తాయి. అందుకే ఒంటరిగా ఉండొద్దు.
అధిక హస్తప్రయోగాన్ని నివారించడానికి మరొక మార్గం రాత్రి త్వరగా నిద్రపోవడం. పరిశోధన ప్రకారం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారు అశ్లీల చిత్రాలను చూడటం లేదా రెచ్చగొట్టే కథలు లేదా నవలలు చదవడం చేస్తారు. ఫలితంగా హస్తప్రయోగంలో పాల్గొంటారు. అశ్లీల దృశ్యాలను చూడకపోవడం వలన మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ వ్యసనాన్ని అరికట్టడానికి ఇది కూడా ఒక గొప్ప మార్గం.
ఆధ్యాత్మికత పట్ల మొగ్గును పెంపొందించుకోవడం మిమ్మల్ని మంచిగా చేస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, మీరు మంచి అనుభూతి చెందుతారు. మీ మనస్సు తేలికగా మారుతుంది. హస్తప్రయోగం వ్యసనాన్ని అధిగమించడానికి మైండ్‌ఫుల్‌నెస్ అవసరం. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలనే మీ దృఢ నిశ్చయం గురించి మీరు పదే పదే మీ మనస్సుకు సమాధానం చెబితే.. అధిగమించడం సులభం అవుతుంది.
మీరు నిజంగా హస్తప్రయోగం వ్యసనాన్ని వదిలించుకోవాలనుకుంటే, మిమ్మల్ని ప్రేరేపించే ఆ బొమ్మలను మీరు వదిలించుకోవాలి. ఆ ఖరీదైన బొమ్మలను విసిరేయడం మీకు కొంచెం కష్టమే అయినా అలా చేస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధ్యానం అనేది శరీరం, మనస్సు రెండింటికీ మంచిది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు, మీ మనస్సుతో ఆ విషయాల గురించి కాకుండా.. ఇతర విషయాల గురించి ఆలోచించేలా చేస్తారు.