Relationship Tips: గర్ల్‌ఫ్రెండ్‍కు సారీ చెప్పాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఇట్టే కలిసిపోతారు!
Relationship Tips: ప్రేమికుల మధ్య గొడవ వస్తే ఎవరో ఒకరు రాజీ పడి సారీ చెబితే బంధం బలంగా నిలబడుతుంది. ఒకవేళ మీరు గర్ల్‌ఫ్రెండ్‍కు క్షమాపణ చెప్పాలనుకుంటే కొన్ని టిప్స్ పాటిస్తే మంచిది. వీటివల్ల మీ ప్రేయురాలు త్వరగా శాంతించే అవకాశం ఉంటుంది.
ఏ రిలేషన్‍లో అయినా గొడవలు జరగడం సాధారణమైన విషయం. ప్రేమికుల మధ్య అప్పుడప్పుడూ వివిధ కారణాలతో గిల్లిగజ్జాలు జరుగుతుంటాయి. గొడవ పడి మళ్లీ కలిస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే, ఏదైనా గొడవ పడ్డాక కలవాలంటే ఎవరో ఒకరు సారీ చెప్పాలి. అయితే, క్షమాపణ ఎలా పడితే అలా చెబితే గొడవ పెద్దిది కూడా కావొచ్చు. అందుకే గర్ల్‌ఫ్రెండ్‍కు సారీ చెప్పేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మరింత త్వరగా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మీ వివరణకు ఆమె ఓకే చేయవచ్చు. అలా.. సారీ చెప్పేందుకు సింపుల్ మార్గాలు ఏవో ఇక్కడ చూడండి.
నేరుగా కలిసి..
మీ ప్రేయసికి క్షమాపణ చెప్పాలనుకుంటే నేరుగా కలవండి. మెసేజ్‍లు, కాల్స్, మెయిల్స్ ద్వారా కాకుండా స్వయంగా కలిసి సారీ చెప్పండి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఆమెను కన్విన్స్ చేసేందుకు తోడ్పడుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని మీరు స్పష్టంగా వ్యక్తం చేయగలరు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. కలిసి సారీ చెప్పడం వల్ల మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుంది. దీనివల్ల మీ గర్ల్‌ఫ్రెండ్ త్వరగా శాంతింతి సారీని అంగీకరించే అవకాశం ఉంటుంది.
ఈ విషయాలను తప్పక చెప్పండి
మీకు తను ఎంత ప్రత్యేకమైన వ్యక్తో, ఎంత ముఖ్యమో ప్రేయసికి మరోసారి గుర్తు చేయండి. సారీ చెప్పే సమయంలో ఈ విషయాలను గుర్తు చేయండి. దీనివల్ల ఆమె త్వరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. మీ బంధం మరింత బలపడుతుంది. గతంలో మీరు సంతోషంగా గడిపిన జ్ఞాపకాలను కూడా గుర్తు చేయండి. ఇద్దరి మధ్య జరిగిన సరదా విషయాలను పంచుకోండి. నవ్వించేందుకు జోక్స్ చెప్పినా బాగానే ఉంటుంది.
లెటర్ రాయడం
ఒకవేళ గొడవ కాస్త పెద్దగా జరిగి.. ఎక్కువ కోపంగా ఉంటే లెటర్ ద్వారా సారీ చెప్పడం మేలు. ఈ లెటర్ కూడా నేరుగా కలిసి ఇస్తేనే బాగుంటుంది. ఒకవేళ కోప్పడితే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో.. గొడవకు దారి తీసిన పరిస్థితులు ఏవో లెటర్‌లో వివరంగా రాయాలి. మీ చర్యలకు సారీ చెప్పాలి. ఇంకోసారి అలా జరగదనేలా భరోసా ఇవ్వాలి. ఒకవేళ నేరుగా కలువలేని పరిస్థితులు ఉంటే.. పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా లెటర్ పంపొచ్చు.
ప్రేమగా చెప్పాలి
సారీ అనేది ఏదో ఇష్టం లేనట్టుగా చెబితే గొడవ మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రేమగా, శాంతంగా చెప్పాలి. ఒకవేళ మీ గర్ల్‌ఫ్రెండ్ కోపం వ్యక్తం చేసినా.. మీరు నిదానంగా సముదాయించాలి. ఏవైనా సందేహాలు అడిగితే విసుగు చెందకుండా సమాధానాలు ఇవ్వాలి. నిజాయితీతో మాట్లాడాలి. ఆ పరిణామాలకు దారి తీసిన పరిస్థితులు ఏంటో వివరించాలి. అసలు గొడవ జరిగేందుకు మూల కారణం ఏంటో మాట్లాడాలి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుందామని చెప్పుకోవాలి. లెటర్ రాసినా మంచి పదాలు వాడాలి. ఈ టిప్స్ పాటించి సారీ చెబితే మీ బంధం మరింత బలపడి.. ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
టాపిక్