పిల్లలకు స్కూల్ బ్యాగులు, షోల్డర్ బ్యాగులు చాలా మంది ఎక్కువ కాలం ఉపయోగించరు. కొన్ని రోజులు వాడుతారు. ఆ తర్వాత వాటిని పెంట కుప్ప మీద పడేస్తారు. కానీ వాటిని సరిగా ఉపయోగించుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది పాత బ్యాగులు పడేయాల్సిన అవసరం లేదు.
మీ పాత బ్యాగులు లేదా పిల్లల పాత బ్యాగులను పారేసే బదులు మీరు వాటిని ఇతర గృహావసరాలకు ఉపయోగించవచ్చు. కొంతమంది మహిళలు బ్యాగులు కొత్తవి ఎక్కువగా కొనేందుకు ఇష్టపడతారు. తర్వాత పాతవి పడేస్తారు. అటువంటి పరిస్థితిలో బ్యాగులు పాతవి అయినప్పుడు.., మీరు వాటిని విసిరేయాలని ఆలోచిస్తారు. కానీ వాటిని పారేసే బదులు, వాటిని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. ఇందులో మీ పిల్లల చిరిగిన లేదా పాత బ్యాగులు ఉంటాయి. మీరు పాత సంచులను ఉపయోగించే వివిధ మార్గాల గురించి తెలుసుకోండి. బ్యాగ్‌లను తిరిగి ఉపయోగించడం కోసం కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
చాలా మంది బాక్సులను ప్రథమ చికిత్స కిట్‌గా ఉపయోగిస్తారు. కానీ మీరు వాటికి బదులుగా పాత బ్యాగులను ఉపయోగించవచ్చు. మీరు దానిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అంతేకాదు ఎక్కువ వస్తువులు వీటిలో పడతాయి. ఇంట్లో కూడా ఏదైనా మూలన పెట్టుకోవచ్చు.
సుత్తి, ఎలక్ట్రికల్ వస్తువులను రిపేర్ చేసే వంటి గృహోపకరణాలను ఓదో మూలన పెట్టే బదులుగా పాత సంచులను ఉపయోగించండి. ఈ వస్తువులను నిల్వ చేయడానికి బ్యాగ్‌లు మంచి మార్గం. అలాగే ఇంట్లో ఏ మూలన అయినా బ్యాగులు పెట్టుకోవచ్చు. ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా అవసరం పడినప్పుడు ఆందోళన చెందకుండా నేరుగా బ్యాగ్ తెరిచి చూస్తే అన్ని ఉంటాయి.
మీరు మీ ల్యాప్‌టాప్‌ను పట్టుకోవడానికి బ్యాగ్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడే ఆ పని చేయవద్దు. దాని కోసం మీ పాత సంచులలో దేనినైనా ఉపయోగించండి. దుమ్ము పడకుండా ఉండేందుకు కూడా ఇవి సహయకరంగా ఉంటాయి.
మీరు మీ పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే పాత బ్యాగ్‌లను ఉపయోగించండి. వాటిని అందులో పెట్టండి. తద్వారా పోగొట్టుకోలేరు, మీరు వాటిని ఎప్పటికీ మరచిపోలేరు. సర్టిఫికెట్స్ పాత బ్యాగులో పెట్టి బీర్వాలో పెట్టండి. మీకు అవసరం ఉన్నప్పుడు దొరుకుతాయి. లేదంటే వాటికోసం ఇంట్లో చిన్నపాటి గొడవ జరగాల్సి వస్తుంది. సురక్షితంగా బ్యాగులో దాచిపెట్టుకోండి.
ఇంట్లో పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉంటాయి. బొమ్మలు వేయడానికి ఏమీ లేకపోతే, వాటిని పిల్లల చిరిగిన బ్యాగ్‌లలో ఉంచండి. పిల్లలకు అదే అలవాటు చేస్తే.. వారు ఆడుకున్న తర్వాత అందులో పెట్టేస్తారు.
చాలా మంది ఇళ్లలో వంట సామాను ఎక్కువగా ఉంటుంది. వాటిని కిచెన్‌లో పెడితే కూడా బాగుండదు. మనకు అవసరం ఉన్నవాటిని తీసుకునేందుకు వెతకాల్సి వస్తుంది. అందుకే పాత బ్యాగులు ఏవైనా ఉంటే వాటిలో పెట్టి అటక మీద పెట్టండి. ఇలా అయితే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవచ్చు.