Remove Oil From Food : వేయించిన ఆహారాల నుంచి నూనెను ఎలా తొలగించాలి?
Remove Oil From Food : కొందరు ఫుడ్ ఎంజాయ్ చేయాలని ఆహారాలు వేయించుకుంటారు. అయితే వాటి పైన ఉన్న నూనెను చూసి వామ్మో తినడం వద్దని అనుకుంటారు. అయితే వేయించిన ఆహారాల మీద ఉన్న నూనె పోయేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

కొన్ని ఆహారాలు వేయించుకుని తింటేనే బాగుంటుంది. అలా అని వాటికి నూనె కారుతూ ఉంటే చిరాకు వేస్తుంది. తినాలనే ఇంట్రస్ట్ కూడా పోతుంది. నిజానికి వండేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ప్రై చేసిన ఆహారానికి నూనె ఎక్కువగా పట్టుకుంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడు ఎంచక్కా లాగించేయెుచ్చు.
ఎప్పుడూ వేయించిన ఆహారాలు తినడం మంచిది కాదు. అవి ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తాయి. బరువు పెరగడం, కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. ఇవన్నీ వంటనూనెతో వచ్చే ఇబ్బందులు. అయితే వంటల్లో నూనె వాడడం పూర్తిగా మానేయడం సాధ్యం కాదు. నూనె లేకుండా వంట చేయడం ఇష్టం ఉండదు. నూనెను వాడండి, కానీ దాని పరిమాణం గురించి జాగ్రత్తగా ఉండండి.
తక్కువ నూనెను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని ఎలా ఉడికించాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆహారం నుండి అదనపు నూనెను తొలగించడానికి మార్గాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే రుచికరమైన ఆహారం తిని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు.
వివిధ రకాల చాప్స్, స్నాక్స్, వేయించిన చికెన్, ఫిష్ ఫ్రై వంటివి నూనెలో వేయించిన ఆహారం తరచుగా జిడ్డుగా మారుతుంది. నూనె చూడగానే తినాలనే కోరిక తగ్గడం సహజమే. అయితే ఇంట్లో పేపర్ టవల్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. పాన్ మీద కాగితపు టవల్ చుట్టడం వల్ల నూనె పీల్చుకుంటుంది. నూనెను పీల్చుకునేందుకు కొన్ని రకాల పేపర్స్ దొరుకుతాయి. వాటిని వాడుకోవచ్చు. న్యూస్ పేపర్ వాడకూడదు. అందులో కెమికల్స్ ఉంటాయి.
నిజానికి డీప్ ఫ్రై కాకుండా బేక్ చేసుకోవచ్చు. బేకింగ్ చేయడానికి చాలా తక్కువ నూనె అవసరం, ఆహారం కూడా చాలా పోషకంగా ఉంటుంది. ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ కలిగి ఉంటే ఆందోళన అవసరం లేదు. తక్కువ నూనెలో ఎయిర్ ఫ్రైయర్ ద్వారా చాలా రుచికరంగా ఉంటుంది.
నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్ లేదా కడాయిలో తక్కువ నూనెతో రుచికరంగా వండుకోవచ్చు. కానీ నాణ్యమైన నాన్‌స్టిక్ పాన్ అయి ఉండాలి. తక్కువ నూనెతో ఆహారాన్ని ఉడికించాలనుకుంటే, నాన్‌స్టిక్ పాన్ ఉపయోగించవచ్చు.
చేపలు, మాంసం, కూరగాయలను కూడా కాల్చవచ్చు. ఇది చాలా తక్కువ నూనెను ఉపయోగిస్తుంది. ఇది తినడానికి రుచికరమైన, ఆరోగ్యకరమైనది కూడా. నూనె లేకుండా కూడా కాల్చుకుని ఆహారాలను తింటే ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కొద్దిగా నూనెతో కూడా రుచికరమైన వండుకోవచ్చు. కూరగాయలను నామమాత్రపు నూనెలో వేయించాలి. తినడానికి కూడా బాగుంటుంది. శరీరం కూడా చక్కగా ఉంటుంది. నూనె కారిపోయేలా మాత్రం ఆహారం వండుకోవద్దు. దీని ద్వారా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.