Hairs On Face : మీ ముఖంపై వెంట్రుకలతో ఇబ్బందిగా ఉందా? సింపుల్ ఇంటి చిట్కాలు
Hair Remove Tips : పురుషులు, మహిళలు ఇద్దరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అలాగే చాలా మందికి ముఖంపై వెంట్రుకలు అసహ్యకరంగా ఉండవచ్చు. వాటిని తొలగించుకునేందుకు ఏం చేయాలి?
ముఖంపై వెంట్రుకల(Hairs On Face) సమస్యను ఎదుర్కొనే మహిళలు దాని కోసం వివిధ క్రీములను ఉపయోగిస్తారు. ఇది ముఖంపై చికాకు, ఎరుపు వంటి కొన్ని దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అయితే దీనికి శాశ్వత పరిష్కారాన్ని అందించే కొన్ని సహజ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ కథనంలో అవి ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు.
చర్మ సంరక్షణ(Skin Care)లో పసుపు, పెరుగు రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మనందరికీ తెలుసు. ఒక టీస్పూన్ పసుపును పెరుగుతో కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెరుగులో ఉండే అంశాలు సహజంగా జుట్టు పెరుగుదలను తగ్గిస్తాయి. మీ ముఖంపై వెంట్రుకల పెరుగుదల(Hair Growth) తగ్గుతుంది.
పుదీనా టీని తయారు చేసి మీకు నచ్చిన విధంగా తాగండి. ఇది ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గించడంలో, ముఖంపై వెంట్రుకలు పెరగకుండా నిరోధించడంలో పని చేస్తుంది. పుదీనా మిమ్మల్ని రిఫ్రెష్ చేయడమే కాదు.. ఇది లోపలి నుండి జుట్టు పెరుగుదలను మందగించేలా ఉపయోగపడుతుంది.
బాగా పండిన బొప్పాయి పండును మెత్తగా చేసి అందులో ఒక చుక్క పసుపు వేసి స్క్రబ్‌గా తయారు చేసుకోవాలి. దీన్ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. బొప్పాయిలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. మీకు మృదువైన, మంచి చర్మాన్ని ఇస్తుంది.
క్యారియర్ ఆయిల్‌తో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలపండి. జుట్టు పెరుగుదలను తగ్గించాలనుకునే ప్రదేశాలలో బాగా మసాజ్ చేయండి. లావెండర్ ఆయిల్ సువాసన మాత్రమే కాకుండా యాంటీ ఆండ్రోజెనిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
శనిగ పిండి పేస్ట్ చేయడానికి నీరు లేదా పాలతో కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వండి. తర్వాత మీ ముఖం కడగాలి. ఇది డెడ్ స్కిన్ ను తొలగించడమే కాకుండా ముఖంలో వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తుంది.