Back Pain Relief: సిజేరియన్ తర్వాత వచ్చే నడుము నొప్పిని తగ్గించుకునే మార్గాలు ఏంటి? నిపుణుల సలహా తెలుసుకోండి!
Back Pain Relief: సాధారణ మహిళలకు వచ్చే నడుము నొప్పి వేరు, సిజేరియన్ చేయించుకున్న వారిలో వచ్చే నొప్పి వేరు. సిజేరియన్ తర్వాత వచ్చే నడుము నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ఇబ్బందే ఉంటే దీని నుంచి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకోండి.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ నడుము నొప్పి వస్తుంది. కానీ సిజేరియన్ చేసుకున్న మహిళలను ఈ సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దీన్ని భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పెయిన్ బామ్ లు రాసుకున్నా కూడా దీని ప్రభావం తగ్గినట్టుగా అనిపించదు. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇక్కడ మీకు కచ్చితంగా ఓ పరిష్కారం లభిస్తుంది. సీజేరియన్ తర్వాత నడుము, వెన్నునొప్పితో బాధపడుతున్న మహిళలు ఏమి చేయాలి అని ప్రముఖ సిద్ధ వైద్య నిపుణులు ఉషా నందిని సూచిస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం రండి..

మహిళల్లో నడుము నొప్పికి కారణాలు
మహిళల్లో నడుము నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రసవం సమయంలో సిజేరియన్ కోసం ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రసవం తర్వాత శరీర బరువు పెరగడం కూడా ఇందుకు ముఖ్య కారణం కావచ్చు.
అంతేకాకుండా చాలా మంది మహిళల్లోహార్మోన్ల అసమతుల్యత వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే పేగుల వాపు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి కూడా నడుము నొప్పి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది.
అందరికీ తెలిసిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం మనం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీని వల్ల కూడా మహిళల్లో నడుము నొప్పులు వస్తున్నాయి.
ఎముకల క్షీణత వంటి కారణాలు కూడా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం లోపం కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు.
గర్భాశయంలో వచ్చే లోపాలు, ముఖ్యంగా ఫైబ్రాయిడ్ కణితి లేదా ఎండోమెట్రియోసిస్ అనే రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలన్నీ మహిళలకు ఇబ్బందులు కలిగిస్తాయి.
మహిళల్లో కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు, తెల్లబట్ట, గర్భాశయ ప్రోలాప్స్, మూత్రాశయ ప్రోలాప్స్, పురీషనాళ ప్రోలాప్స్ కూడా నడుము నొప్పికి కారణాలే.
మీరు కూర్చుని పనిచేసే వ్యక్తి అయితే మీరు కూర్చుని పనిచేసే విధానం కూడా మీ వెన్నునొప్పికి కారణం అవుతుంది. రోజుకు 8 నుండి 10 గంటలు కూర్చుని పనిచేసేటప్పుడు, కూర్చునే విధానం కూడా కారణం అవుతుంది.
నడుము నొప్పికి పరిష్కారాలు ఏంటి?
విపరీతమైన నడుము నొప్పిని కూడా ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోగలిగే మార్గాన్ని ఆమె వివరించారు. అదేంటో చూద్దాం..
కావలసినవి
సొంటి (Dry Ginger) – అర అంగుళం
తాటి బెల్లం (Palm Jaggery) – 1 స్పూన్ (పొడి)
తయారీ విధానం
ముందుగా సొంటిని చితకొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.
తీసుకున్న నీరు సగానికి సగం మరిగే వరకూ ఉంచిన తర్వాత దాంట్లో తాటి బెల్లాన్ని దంచి వెయ్యాలి.
ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్నప్పుడు రోజుకు ఒకసారి మూడు రోజుల పాటు తప్పకుండా తాగాలి. ఇది శరీరంలో అధిక వాయువును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. వెన్ను నొప్పి నుంచి చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.