కొందరికి రక్తంలో యూరిక్ ఆసిడ్(Uric Acid) ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు వెంటనే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లేదంటే మరింత సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. రక్తంలో యూరిక్ ఆసిడ్స్ లెవెల్ కంట్రోల్ చేయాలంటే కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాలి. అవేంటో చూద్దాం..
రక్తంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువ ఉన్నవారు.. రెడ్ మీట్ అంటే మటన్ తినకూడదు. అంతేకాదు ఆర్గాన్ మీట్ అంటే లివర్ లాంటివి తినొద్దు. వాటికి బదులుగా చికెన్, చేపలు తినొచ్చు. అయితే ఇది కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కచ్చితంగా అల్కాహాల్ తగ్గించాలి. మెల్ల మెల్లగా మోతాదు తగ్గిస్తూ.. పూర్తిగా దూరం చేసుకుంటే ఇంకా మంచిది.
యారిక్ ఆసిడ్ కంట్రోల్‍లో ఉండాలంటే.. బరువు తగ్గడం(Weight Loss) కూడా చేయాలి. ప్రస్తుతమున్న శరీర బరువులో పది శాతం తగ్గిస్తే.. యూరిక్ ఆసిడ్ కంట్రోల్(Uric Acide Control) అవుతుంది. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పప్పులు కూడా ఎక్కువగా తీసుకోవద్దు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కూడా యూరిక్ ఆసిడ్ కంట్రోల్ అవుతుంది.
నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 10 గ్లాసుల వరకు నీరు తాగండి. ఇలా చేస్తే.. యూరిక్ ఆసిడ్‍తోపాటుగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందు నీరు సాయపడుతుంది. చెర్రీస్ ను మీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటికి యూరిక్ ఆసిడ్ తగ్గించే గుణం ఉంటుంది.
రోజు భోజనం తర్వాత ఓ యాపిల్ తినండి. ఇందులో ఉండే మాలిక్ ఆమ్లం యూరిక్ ఆసిడ్ న్యూట్రల్ చేసేందుకు ఉపయోగపుడుతంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కూడా డౌన్ చేస్తుంది. రోజు నిమ్మరసం తాగండి. ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
క్యారెట్, బీట్ రూట్, దోసకాయ, జ్యూస్ కూడా తాగండి. అయితే ఎక్కువ మోతాదులో తాగొద్దు. అంతేకాదు.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా యూరిక్ ఆసిడ్ ను కంట్రోల్ చేస్తాయి. ఓట్స్, ఆకుకూరలు, బ్రోకలి, నారింజ, స్ట్రాబెర్రీలు.. మెుదలగునవి తినాలి.