Exercise for Thigh Fat: తొడ కండరాల్లోని కొవ్వు తగ్గేందుకు ఈ ఎక్సర్‌సైజ్‍లు చేయండి!
Exercises for Thigh Fat: తొడల వద్ద కొవ్వు ఎక్కువగా ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అయితే, రెగ్యులర్‌గా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‍లు చేస్తే తొడల ఫ్యాట్ తగ్గుతుంది.
తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటే వేగంగా నడవలేరు, ఎక్కువ పరుగెత్తలేరు. కాళ్లకు కూడా భారంగా మారి మోకాళ్ల నొప్పి కూడా వచ్చే రిస్క్ పెరుగుతుంది. నడవడం, పరుగెత్తడం కష్టంగా అనిపిస్తుంది. ఫ్యాట్ వల్ల తొడలు లావుగా ఉండటంతో షార్ట్స్ లాంటివి వేసుకునేందుకు కూడా వెనుకాడాల్సిన పరిస్థితి వస్తుంది. తొడల ఫ్యాట్‍ను ఎలా కరిగించాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎక్సర్‌సైజ్‍ల ద్వారా కొవ్వును తగ్గించుకోవచ్చు. తొడల ఫ్యాట్ కరిగేలా చేయగల 4 వ్యాయమాలను ఇక్కడ చూడండి.
స్క్వాట్స్
కాళ్లపై శరీర భారం వేసే స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్ వల్ల తొడలపై కూడా ఒత్తిడి బాగా పడుతుంది. దీంతో తొడల భాగంలో ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు తోడ్పడుతుంది.
- స్క్వాట్ చేయండిలా: ముందుగా ఓ చోట నిలబడి కాళ్లను దూరంగా భుజాలకు సమాంతరంగా చాపాలి.
- ఆ తర్వాత నడుమును వంచాలి. కుర్చీలో కూర్చున్నట్టుగా వంగి భంగిమ పెట్టాలి.
- వెనుక కుర్చీ ఉందన్నట్టుగా ఊహించుకొని ఈ పొజిషన్ చేయాలి. శరీర భారమంతా కాళ్లపై ఉంటుంది. అలానే కాసేపు ఉండాలి. స్క్వాట్‍లో మరిన్ని రకాలు కూడా ఉంటాయి.
బర్పీస్
బర్పీస్ చేయడం వల్ల పూర్తి ఫిట్‍గా ఉంటుంది. పుషప్, జంప్‍తో ఉండే ఈ వ్యాయామం.. తొడల వద్ద కొవ్వును కరిగించడంలో ఎఫెక్టివ్‍గా ఉంటుంది.
- బర్పీస్ ఇలా: ముందుగా నిటారుగా నిలబడాలి. కాళ్లు దూరంగా ఉంచాలి.
- కాస్త జంప్ చేసి ఆ తర్వాత వంగి చేతులను నేలకు ఆనించాలి.
- వెంటనే కిందికి తూలి పుష్‍అప్ పొజిషన్‍కు రావాలి. ఆ తర్వాత బాడీని పైకి లేపుతూ ఓ పుషప్‍లా చేయాలి.
- ఆ ఫ్లోలోనే పైకి లేచి నిలబడిన పొజిషన్‍కు రావాలి. మళ్లీ మొదటి నుంచి రిపీట్ చేయాలి.
లంజెస్
లంజెస్ వ్యాయామం చేయడం వల్ల తొడ కండరాలు సాగుతాయి. తొండలపై ఒత్తిడి బాగా పడుతుంది. దీంతో ఆ భాగంలో కొవ్వు కరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
- లంజెస్ ఇలా: ముందుగా నిటారుగా నిలబడి.. రెండు చేతులను నడుముపై పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఎడమ కాలిని ముందు చాపి మోకాలిని వంచాలి.
- 90 డిగ్రీల కోణంలో కాలిని వంచాలి. మోకాలిని అరచేతులతో పట్టుకోవాలి. అలాగే ఓ మూడు సెకన్ల పాటు ఉండాలి. అ సమయంలో శరీర భారం ఎక్కువగా ముందుకు వంచిన కాలిపై ఉంటుంది.
- ఆ తర్వాత మళ్లీ నిలబడిన పొజిషన్‍కు వచ్చి కుడి కాలితో అలా చేయాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయాలి.
ఫ్లై జంప్ జాక్స్
వెంటవెంటనే ఎగురుతూ.. వంగుతూ చేసే ఈ ఫ్లై జంప్ జాక్స్ వల్ల తొడల్లోని ఫ్యాట్ ప్రభావవంతంగా బర్న్ అవుతుంది.
- ఫ్లై జంప్ జాక్స్ ఇలా: ముందుగా ఓ చోట నిటారుగా నిలబడాలి. కాళ్లు కాస్త దూరం పెట్టాలి.
- ఆ తర్వాత కాస్త ఎగిరి కూర్చున్నట్టుగా చేసి చేతులు కిందతగిలేలా వంగాలి.
- వెంటనే పైకి ఎగిరి చేతులను పైకి లేపాలి. మళ్లీ కిందికి వంగి ఎగరాలి. ఇలా రిపీట్ చేస్తుండాలి.