Gray Hair: జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? ఈ రహస్యం మీకు తెలుసా?-how to prevent gray hair the secret revealed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gray Hair: జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? ఈ రహస్యం మీకు తెలుసా?

Gray Hair: జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? ఈ రహస్యం మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 19, 2023 03:00 PM IST

జుట్టు తెల్లబడిపోయిందా? 30 ఏళ్లకే ఈ సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే ఈ సీక్రెట్ తెలుసుకోండి. మీ జట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.

జుట్టు తెల్లబడుతోందా? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
జుట్టు తెల్లబడుతోందా? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి

మీరు మీ జుట్టు తెల్లబడుతోందని చింతించకండి. ఈ సమస్య మీ ఒక్కరిది కాదు. చాలా మంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య తీవ్రం కాకుండా కొన్ని సహజ పద్ధతుల్లో పరిష్కరించుకోవచ్చు.

జుట్టు తెల్లబడడానికి కారణాలు, పరిష్కారాలు

  1. మీ శరీరంలో విటమిన్ల లోపం కారణంగా మీ జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. ముఖ్యంగా విటమిన్ బీ12, విటమిన్ డీ, యాంటాక్సిడెంట్లు తగ్గడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. అందువల్ల మీరు వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని ఈ విటమిన్లు మీ శరీరంలో తగినంత ఉన్నాయా? లోపాన్ని ఎదుర్కొంటున్నారా గమనించండి. ఒకవేళ ఆయా విటమిన్ల లోపం ఉంటే అవి లభించే డెయిరీ ఉత్పత్తులు, గుడ్లు, సాల్మన్ చేపలు, ఆలివ్ ఆయిల్, విభిన్న కూరగాయలు, సీజన్ వారీ పండ్లు తినడం ప్రారంభించండి. విటమిన్ డీ కోసం తగినంత సూర్యరశ్మి సోకేలా చూసుకోండి. విటమిన్ లోపం ఉంటే వైద్య సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు వాడడం అవసరం.
  2. మీ జుట్టు తెల్లబడటానికి మరొక కారణం మీరు బాగా ఒత్తిడి ఎదుర్కోవల్సి రావడం. దీని వల్ల జుట్టు రాలడమే కాకుండా తెల్లబడుతుంది. తెల్ల వెంట్రుకలు క్రమంగా విస్తరిస్తాయి. అందువల్ల ఒత్తిడిని మేనేజ్ చేయడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. పని భారం తగ్గించుకోండి. స్మార్ట్ వర్క్ నేర్చుకోండి.
  3. మీ జుట్టు తెల్లబడడానికి కారణాల్లో పొల్యూషన్ కూడా ఒకటి. కాలుష్యం కారణంగా మీ జుట్టు అనారోగ్యానికి గురవుతుంది. అందువల్ల కాలుష్యం నుంచి కాపాడుకునే మార్గాలు వెతకండి. అలాగే రసాయనాలు లేని షాంపూలతో రెండు రోజులకోసారి తలస్నానం చేయండి.
  4. తెల్లవెంట్రుకలు రావడానికి మరో కారణం ధూమపానం. పొగాకు కారణంగా మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతిని తెల్లవెంట్రుకలు వస్తాయి. అందువల్ల మీ జుట్టు నల్లగా ఉండాలనుకుంటే మీరు స్మోకింగ్ మానేయాలి. స్మోకింగ్ మానేయడం వల్ల కేవలం మీ జుట్టు ఆరోగ్యం మాత్రమే కాదు.. మీ ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, బ్లడ్ ప్రెషర్, మధుమేహం వంటి వ్యాధులన్నీ నయమవడం స్టార్ట్ అవుతుంది.
  5. మాడుకు రక్తప్రసరణ: మీ జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండడానికి మీ మాడుకు రక్తప్రసరణ సరిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే మీరు అప్పుడప్పుడు తేలికపాటి మర్దన చేయించుకోవాలి. దీని వల్ల మీ మాడు, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.

WhatsApp channel