Vegetable Upma : వెజిటేబుల్ ఉప్మా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి
Vegetable Upma For Breakfast : ఉప్మా తినేందుకు చాలా మందికి చిరాకు. అయితే వెజిటేబుల్ ఉప్మా చేసుకుని తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచి కూడా బాగుంటుంది.

మీరు అల్పాహారం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా? ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి చాలా సమయం పడుతుందని మీరు అనుకోవచ్చు. ఉప్మా తినాలి అంటే చాలా మంది ఇబ్బంది పడుతారు. ఇక ఈ కాలంవారు అయితే అసలు ఉప్మా జోలికి కూడా వెళ్లకుండా ఉన్నారు. కానీ దానితోనూ ఆరోగ్యానికి మంచిది. అందులో కూరగాయలు వేసుకుని తింటే చాలా మంచిది.
ఉప్మా రుచికరమైనది. వారంలో చాలాసార్లు తిని విసుగు చెందితే కొత్తగా ట్రై చేయండి. వెజిటేబుల్ ఉప్మా తయారు చేయండి. వెజిటబుల్ ఉప్మా దక్షిణ భారతీయుల సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. దీని తయారీలో ఉపయోగించే క్యారెట్, క్యాప్సికమ్, బఠానీలు, కొత్తిమీర రుచిని పెంచుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. దాని తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి? వెజిటేబుల్ ఉప్మా ఎలా చేస్తారో చూద్దాం..
ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
రవ్వ - 200 గ్రాములు, బీన్స్ - 1 కప్పు, ఉల్లిపాయ - 2, టొమాటో - 1, క్యారెట్ - 1, అల్లం -1/2 అంగుళం, వెల్లుల్లి - 2, మిరపకాయ - 4, పుదీనా ఆకులు - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1/4 tsp, ఆవాలు - 1/4 tsp, గరం మసాలా పొడి - 1/4 tsp, పలావ్ ఆకులు - 2, ఏలకులు-2, లవంగం-4, దాల్చినచెక్క - 2, కరివేపాకు కొద్దిగా, రుచికి ఉప్పు
వెజిటేబుల్ ఉప్మా తయారీ విధానం
ఒక గిన్నెలో రవ్వ తీసుకుని బాగా వేయించాలి. వేయించడానికి 5 నిమిషాలు సరిపోతుంది.
మరోవైపు అల్లం, యాలకులు, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి.
గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్లు పోసి రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి జీలకర్ర, పలావ్ ఆకులు, మెంతులు, మసాలా అన్నీ వేసి వేయించాలి.
తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్లు వేసి బాగా వేయించాలి. తర్వాత పచ్చిబఠానీలు, ఉప్పు వేయాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత రుబ్బిన మసాలా దినుసులు వేసి కాసేపు వేయించాలి.
అందులో టమోటో, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం నీరు కలపండి. నీరు సరిపోయేలా చూసుకోవాలి.
ఈ నీటిని బాగా మరిగించండి. తర్వాత అందులో వేయించిన రవ్వ వేసి బాగా కలపాలి.
2 నిమిషాలు కలిపి.. తరువాత మూత మూయండి. మధ్యమధ్యలో తరచుగా కలపాలి. అంతే వెజిటేబుల్ ఉప్మా రెడీ.