Magical juices: అందాన్ని పెంచి, బరువు తగ్గించే మూడు మ్యాజికల్ జ్యూసులివే..
Magical juices: మూడు మ్యాజిక్ డ్రింకులతో ఆరోగ్యం, జుట్టు పెరుగుదల, బరువు తగ్గడం, స్కిన్ గ్లో లాంటి లాభాలెన్నో ఉన్నాయి. వాటినెలా తయారు చేయాలో తెల్సుకుందాం.
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను తెచ్చి వాడుతుంటారు. వీటివల్ల ఫలితాలు వెంటనే కనిపించొచ్చు. కానీ వాటిలో ఉన్న రసాయనాలు మన చర్మం, జుట్టు ఆరోగ్యన్ని దెబ్బతీస్తాయి. అలాగే వాటి ధరలు కూడా ఎక్కువే.
అలాకాకుండా అందాన్ని పెంచే చౌక మార్గం ఒకటి ఉంది. అది కూడా మన వంటగదిలోనే. చాలా సాధారణమైన పదార్థాలతో కొన్ని రకాల మ్యాజిక్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయి. వీటిని ఆల్ రౌండర్ జ్యూసులు అనుకోండి. బరువు తగ్గించడానికి, చర్మం అందం పెంచడానికి, జుట్టు పెరగడానికీ ఇవి సాయపడతాయి.
1) తెల్లటి మజ్జిగ పానీయం:
మజ్జిగతో చాలా సులభమైన పానీయం ఎలా తయారు చేయాలో చూద్దాం... దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఈ వేడి వాతావరణానికి సరిపోయే దీని రుచి మీకు బాగా నచ్చుతుంది. దీన్ని తయారు చేయాలంటే ముందుగా ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని ఎండిన కరివేపాకు ఆకులను చేతులతో నలిపి పొడిగా చేసి వేయాలి. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసి రుచికి తగినంత బ్లాక్ సాల్ట్ కలపాలి. మీ మ్యాజిక్ డ్రింక్ రెడీ. ఇంత సులభంగా తయారు చేసుగలిగే ఈ డ్రింక్ రోజూవారీగా మీ డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే. ఈ పానీయం తాగడం వల్ల మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది, ఇది బరువు తగ్గించడంలో సాయపడుతుంది, జుట్టు పెరుగుదల మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చూస్తుంది.
2) రిఫ్రెషింగ్ గ్రీన్ జ్యూస్:
ఈ గ్రీన్ జ్యూస్ తయారీ మరింత సులభం. తాజాగా, రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఈ రెండవ రెసిపీలో, చాలా టేస్టీ మరియు రిఫ్రెషింగ్ జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇందుకోసం కొద్దిగా కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, దోసకాయ ముక్కలు, అరచెంచా నిమ్మకాయ రసం, ఉప్పు.. ఈ పదార్థాలన్నీబ్లెండర్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోస్తే మంచిగా జ్యూస్ లాగా తయారవుతాయి. దీన్ని రాత్రి భోజనం తర్వాత తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
3) పింక్ గ్లో ఇచ్చే పింక్ జ్యూస్:
మూడవ రెసిపీ చాలా ప్రత్యేకమైనది. ఇలా వారం రోజుల పాటు రోజూ తాగితే చర్మం అందంలో, ఆరోగ్యంలో తేడా కనిపించడం మొదలవుతుంది. పింక్ జ్యూస్ తయారు చేయడానికి బీట్ రూట్, కీర దోసకాయ, క్యారట్, ఆపిల్, గూస్బెర్రీ అవసరం. వీటన్నింటినీ బాగా మిక్సీ పట్టి జ్యూస్ తయారు చేసుకోవాలి. చివరిగా కొద్దిగా నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో కలిపిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇది చర్మం, ఆరోగ్యం, బరువు తగ్గడం, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.