Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్
Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.
గుడ్లు ఎవరైనా ఇష్టపడే మంచి వంటకం. ఎందుకంటే మాంసాహారం తినని వారు కూడా గుడ్లు తింటారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏ ఆహారంలోనూ లేని ప్రొటీన్లు గుడ్లలో అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి.

మీ రోజువారీ భోజనం, స్నాక్స్‌లో గుడ్లను చేర్చుకోండి. గుడ్ల నుండి అనేక రకాల వంటకాలు తయారు చేయవచ్చు. ఇందులో ఉడికించిన గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా గుడ్ల నుండి అనేక రకాల రుచికరమైన వంటకాలు ఈజీగా చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువగా పట్టదు. ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రై, ఆమ్లెట్, కర్రీ, ఫ్రై, ఆఫ్-బాయిల్ ఇలా చాలా రకాలుగా గుడ్లతో కర్రీలు తయారుచేసుకోవచ్చు.
గుడ్డుతో కూర లేదా పులుసును చేసి ఆనందించవచ్చు. గుడ్లు ఉడకబెట్టి పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ప్రత్యేక రుచిగల గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. ఇంతకీ ఈ స్పెషల్ ఎగ్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా చేయాలో తెలుసుకుందాం.
గుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు
గుడ్లు-5, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1, టొమాటో - 1, తురిమిన కొబ్బరి - 1 కప్పు, లవంగాలు - 6, అల్లం వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్, కారం పొడి - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 1/4 tsp, రుచికి ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా..
గుడ్డు పులుసు తయారీ విధానం
ముందుగా 5 గుడ్లు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర ఉంచి నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. 1 నిమిషం తర్వాత టొమాటో వేసి వేయించాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, అల్లం, లవంగాలు, వెల్లుల్లి, ధనియాల పొడి, అరకప్పు, ఎండుమిర్చి, నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ రుబ్బిన మసాలాను స్టవ్ మీద ఒక పాత్రలో వేసి, కొంచెం నీరు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత మూసివేసి 3 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు మూత తీసి అన్ని గుడ్లను ఉడకబెట్టిన పులుసులో ఉంచండి.
గుడ్డును నేరుగా వేసుకోవచ్చు.. లేదంటే.. కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి తిప్పి, చివరగా కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే మీరు ఇష్టపడే రుచికరమైన గుడ్డు పులుసు రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా రుచిగా ఉంటుంది.