Potato Roast Recipe : పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది-how to prepare potato roast recipe step by step method ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Roast Recipe : పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది

Potato Roast Recipe : పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది

Anand Sai HT Telugu

Potato Roast Recipe In Telugu : పొటాటో రోస్ట్ తినేందుకు చాలా బాగుంటుంది. అన్నంలోకి సైడ్ డిష్‌లా పెట్టుకుని దీనిని లాగించేయెుచ్చు.

పొటాటో రోస్ట్

బంగాళదుంపను కొంతమంది ఇష్టంగా తింటారు. దీనితో వివిధ రకాల రెసిపీలు చేసుకోవచ్చు. కూర వండుకోవచ్చు. లేదంటే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. దీనిని తినడానికి ఇష్టపడని వారు ఉంటారు. కొందరి ఇళ్లలో బంగాళదుంప ఫ్రై ఎక్కువగా చేస్తుంటారు. అన్నంలోకి సైడ్‌ డిష్‌లాగా తింటారు. అయితే దీనిని సరిగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

మీ కుటుంబం బంగాళదుంపలు తినడానికి ఇష్టపడుతుందా? తరచుగా ఇంట్లో బంగాళదుంపలతో ఏదో ఒకటి చేస్తారా? భోజనంలోకి బంగాళదుంప ఫ్రై చేసుకుంటారా? అయితే బంగాళదుంప రోస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.. దీన్ని తయారు చేయడం చాలా సులభం, ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడుతారు.

బంగాళదుంప వేపుళ్లను డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఎలా చేయాలో తెలుసుకోండి. పొటాటో ఫ్రై రిసిపికి సంబంధించిన సింపుల్ విధానం ఇక్కడ ఉంది. ఈ రోస్ట్ ను పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తూ తింటారు.

బంగాళదుంప రోస్ట్‌కు కావాల్సిన పదార్థాలు

బంగాళదుంప - 1/2 కిలోలు, సోంపు పొడి - 1 1/2 టేబుల్ స్పూన్లు, కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి అనుగుణంగా, మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు, అల్లం – 1 అంగుళం (తరిగినది), వెల్లుల్లి – 6-8, లవంగాలు నాలుగైదు, పచ్చిమిర్చి – 2, కరివేపాకు – 1 కట్ట.

బంగాళదుంప రోస్ట్‌ తయారీ విధానం

ముందుగా బంగాళదుంప తొక్క తీసి ముక్కలుగా కోసి నీళ్లలో వేయాలి. తర్వాత మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకులను మెత్తగా రుబ్బుకోవాలి.

తర్వాత ఒక నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని అందులో నూనె పోయాలి. తర్వాత తరిగిన బంగాళదుంపలను వేయాలి. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత సోంపు పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, లవంగాలు, మిరియాల పొడి వేసి కలపాలి.

తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. బంగాళదుంపలు బాగా ఫ్రై అయ్యేవరకు ఉంచుకోవాలి. అంతే బంగాళదుంప రోస్ట్ రెడీ.