Kalagaya Kura Recipe : కాలగాయ కూర రెసిపీ.. ఇదో కొత్త రకం రుచి.. ట్రై చేయండి
Kalagaya Kura Recipe : వంటలోకి చాలా రకాల కూరగాయలు వాడాలి, కొత్త రకం రుచి కావాలి.. అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ కాలగాయ కూర రెసిపీని ట్రై చేయండి

కాలగాయ కూర రెసిపీ.. పేరు వినేందుకు కొత్తగా ఉంది కదా. రుచి కూడా భిన్నంగా ఉంటుంది. తయారు చేయడం చాలా ఈజీ. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. కాలగాయ కూర రెసిపీ చేసేందుకు సమయం కూడా ఎక్కువగా తీసుకోదు. ఇందులో శరీరానికి మంచి చేసే రకరకాల కూరగాయలు ఉపయోగిస్తారు. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కాలగాయ కూర రెసిపీ కొత్తరకం. దీనిని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. క్యారెట్ లాంటివి సరిగా తినని పిల్లలకు ఈ కూర చేసి పెడితే ఎన్నో పోషకాలు అందుతాయి. ప్లాట్ ఫామ్ 65 చెఫ్ సురేశ్.. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో వివరించారు.
కాలగాయ కూరకు కావాల్సిన పదార్థాలు :
1. క్యారెట్ - 100 గ్రాములు
2. బీన్స్ - 100 గ్రాములు
3. పాలకూర - 2 కట్టలు
4. ఆలూ - 1
5. టమాటో - 1
6. క్లస్టర్ బీన్స్ - 100 గ్రాములు
7. ఉల్లిపాయ - 1
8. పచ్చి మిరపకాయలు - కొంచెం
9. కరివేపాకు - కొంచెం
10. సొరకాయ - కొంచెం
11. నూనె - సరిపడేంత
12. అల్లం - 20 గ్రాములు
13. ధనియాల పొడి - 10 గ్రాములు
14. గరం మసాలా - 05 గ్రాములు
15. ఉప్పు - రుచికి తగినంత
కాలగాయ కూర తయారీ విధానం
అన్ని కూరగాయలను బాగా కడుక్కోవాలి. సమాన ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తర్వాత మందపాటి అడుగు పాన్‌లో నూనె వేసి వేడి చేయండి.
ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
అనంతరం ఉప్పు, పసుపు జోడించండి.
అన్ని కూరగాయలను అందులో వేయాలి. ఒక మూతతో కప్పండి.
కొన్ని నిమిషాలు ఉడికించి, కరివేపాకు, మిరపకాయ వేసుకోవాలి. మళ్లీ కాసేపు ఉడికించాలి.
కూరగాయలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, ధనియాలను వేయాలి. అంతే కాలగాయ కూర రెసిపీ రెడీ. వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
ఈ రెసిపీని తయారు చేయడం ఈజీనే. కూరగాయలు అందులో వేసుకోవాలి. మనకు కావాల్సిన కూరగాయలతోనూ చేసుకోవచ్చు. అయితే పైన చెప్పిన కూరగాయలతో రుచిగా ఉంటుంది. దీనిని అన్నంలోకి సైడ్ డిష్ లాగా తినొచ్చు. నేరుగా తిన్న కూడా బాగానే ఉంటుంది. పిల్లలు తినేలా ఇది అలవాటు చేయండి. ఆరోగ్యానికి మంచిది. చాలా పోషకాలు లభిస్తాయి.