Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ
Iskon khichdi Recipe In Telugu : కిచిడీని చాలా మంది తిని ఉంటారు. అయితే ఎప్పుడైనా ఇస్కాన్ కిచిడీ రెసిపీ ట్రై చేశారా? బాగుంటుంది.
కిచిడీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో వేసుకునే రకరకాల పదార్థాలు మన ఆరోగ్యానికి మంచివి. అయితే కొన్నిసార్లు మనకు వంట చేసేందుకు టైమ్ ఎక్కువగా ఉండదు. అలాంటి సమయంలో వెంటనే తయారు చేసుకునేందుకు ఇస్కాన్ కిచిడీని ట్రై చేయండి. చాలాసార్లు మనకు ఆఫీసు నుంచి రాగానే వంటపై ఎక్కువ టైమ్ పెట్టలేం. వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలో సులభంగా తక్కవ సమయంలో చేసుకునే వంటకాలు చేయాలి. అలాంటి వాటిలో ఒకటి ఇస్కాన్ కిచిడీ. దీనిని తయారు చేసందుకు ఎక్కువ సమయం పట్టదు.
కిచిడీ అనేది అన్నం, పప్పులతో తయారుచేసే మంచి భోజనం. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఈ రెసిపీ ఎక్కువగా ఇష్టం. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే పోషకాలు ఎన్నో దొరుకుతాయి. దీనితో జీర్ణ సమస్యలు కూడా ఉండవు. త్వరగా, రుచికరమైన కిచిడీని ఎలా చేసుకోవాలో ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్ చెబుతున్నారు. ఈ ఇస్కాన్ కిచిడీ తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం..
ఇస్కాన్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు
కప్పు బియ్యం
కప్పు పెసరు పప్పు
1 టేబుల్ స్పూన్ నెయ్యి
అర టీస్పూన్ జీలకర్ర
అర టీస్పూన్ పసుపు పొడి
2 కప్పుల నీళ్లు
అర టీ టీస్పూన్ కారం
1 బే ఆకు
ఉప్పు, రుచికి
ఇస్కాన్ కిచిడీ తయారీ విధానం
బియ్యం, పప్పును కలిపి సుమారు 30 నిమిషాలు నానబెట్టండి. తరువాత నీటితో మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో మీడియం వేడి మీద నెయ్యిని వేడి చేసి జీలకర్ర వేయండి.
తర్వాత బే ఆకు, పసుపు పొడి, కారం, ఉప్పు, నీరు కుక్కర్‌లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, పప్పును అందులో వేసుకోవాలి.
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను మూతతో మూసివేసి మీడియం వేడి మీద రైస్ ఉడికించాలి.
ఇప్పుడు పొయ్యిని ఆపేసి కుక్కర్ లో ఆవిరినీ అంత తీసివేసి ఓపెన్ చేయండి.
పైన నెయ్యిని వేసి వేడిగా సర్వ్ చేయండి. ఇస్కాన్ కిచిడీ రెసిపీ చాలా బాగుంటుంది.
ఈ కిచిడీని తయారుచేసందుకు సమయం ఎక్కువగా పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇస్కాన్ కిచిడీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ మీరు తిన్న కిచిడీల మాదిరికాకుండా ఇదే వేరేలా ఉంటుంది. ఇందులో నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. నెయ్యితో చేసేయెుచ్చు. పిల్లలు, పెద్దలు ఈ కిచిడీని ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి.