Garlic Rice : వెల్లుల్లి రైస్.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది-how to prepare garlic rice for breakfast to get benefits in winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Garlic Rice : వెల్లుల్లి రైస్.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది

Garlic Rice : వెల్లుల్లి రైస్.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది

Anand Sai HT Telugu

Garlic Rice For Breakfast : వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనితో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తినవచ్చు. శీతాకాలంలో శరీరానికి చాలా మంచిది.

ప్రతీకాత్మక చిత్రం (unsplash)

మీరు గార్లిక్ రైస్‌ ఎప్పుడైనా రుచి చూశారా? ఈ రెసిపీ చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పులిహోర కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారంగా చేయడానికి సులభమైన వంటకం. మీరు దీని రుచిని కచ్చితంగా ఇష్టపడతారు. చేయడం కూడా ఈజీనే. వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటని పొందవచ్చు.

వెల్లుల్లి రైస్ తయారీ విధానం

1 కప్పు బియ్యం, వెల్లుల్లి 15-20, లవంగాలు 2, ఉల్లిపాయలు (మధ్యస్థ పరిమాణం) 2, పచ్చిమిర్చి 3, ఎండు మిరపకాయలు 2, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి/నూనె, 1/4 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పొడవైన శనిగలు, కొత్తిమీర, రుచికి ఉప్పు, 1/2 నిమ్మకాయ, ఆవాలు కొన్ని, కరివేపాకు కొంత.

ముందుగా అన్నం ఉడికించాలి.

అది పూర్తి అయిన తర్వాత.. ఇప్పుడు పాన్ వేడి చేసి నూనె లేదా నెయ్యి వేయాలి.

అది వేడయ్యాక అందులో వెల్లుల్లిపాయలు వేసి వేయించి దింపేయాలి.

ఇప్పుడు నూనెలో ఆవాలు వేయాలి, అవి శబ్దం రాగానే అందులో కరివేపాకు వేయాలి.

ఇప్పుడు శనిగలు వేసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలను వేయండి.

తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి, ఉల్లి కొద్దిగా గోధుమరంగులోకి మారేదాకా వేయించాలి.

ఇప్పుడు వేయించిన వెల్లుల్లిపాయలు వేసి, రుచికి ఉప్పు వేసి కలపాలి, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి.

అన్నం వేసి, కాస్త నిమ్మరసం పిండుకుని మిక్స్ చేసుకోవాలి. కావాలంటే తర్వాత కొత్తిమీర తరిగి వేసుకోవాలి.

గమనిక : మీకు కారంగా కావాలంటే మీరు మరో రెండు పచ్చిమిర్చి వేయవచ్చు. మసాలా తక్కువగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు. కావాలంటే ఇతర పదార్థాలు కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేదా నూనె ఏదైనా వాడుకోవచ్చు.