Coconut Rice : ఇది మామూలు రైస్ కాదు.. కొబ్బరి రైస్.. చేయడం సులభం-how to prepare coconut rice for breakfast know easy process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Rice : ఇది మామూలు రైస్ కాదు.. కొబ్బరి రైస్.. చేయడం సులభం

Coconut Rice : ఇది మామూలు రైస్ కాదు.. కొబ్బరి రైస్.. చేయడం సులభం

Anand Sai HT Telugu

Coconut Rice For Breakfast : కొబ్బరి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. దీనితో వివిధ రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా అల్పాహారంలోకి కొబ్బరి అన్నం తయారు చేసి తిన్నారా?

కొబ్బరి రైస్ (Unsplash)

ఉదయాన్నే అల్పాహారం గురించి కచ్చితంగా ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజూ అదే బ్రేక్‌ఫాస్ట్ తినడం మీకు కూడా బోర్‌గా ఉంటుంది. కొత్తగా ఏదైనా తినాలని అనుకుంటారు. కానీ టైమ్ ఉండదు. అదే తక్కువ సమయంలో మంచి అల్పాహారం తయారు చేసి తింటే బాగుంటుంది కదా. అందుకోసం కొబ్బరి అన్నం తయారు చేసుకోండి.

ప్రతి రోజు ఉదయం ఎవరైనా అల్పాహారం తయారు చేయాలి. అయితే రోజుకో రెసిపీని తయారు చేసుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటే ఈ కొబ్బరి అన్నం ట్రై చేయండి. ఇది మిగతా రైస్ కంటే రుచిగా ఉంటుంది. మీకు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇది తురిమిన కొబ్బరిని ఉపయోగించి తయారు చేయగల రైస్. ఈ కారణంగా బాగా రుచిగా ఉంటుంది, తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది.

సాధారణంగా కొబ్బరితో చేసే వంటకాలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఇందులో ఉపయోగించే సాధారణ పదార్థాలు దాని అద్భుతమైన రుచికి కారణమవుతాయి. కోకోనట్ రైస్ రెసిపి అటువంటి ఆహారాలలో ఒకటి. దీన్ని చేయడం చాలా సులభం. కావలసిన పదార్థాలు కూడా తక్కువ. కొబ్బరి అన్నం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం..

కొబ్బరి రైస్‌కు కావాల్సిన పదార్థాలు

కొబ్బరి (తురిమిన) - 1 కప్పు

బియ్యం - 1 గిన్నె

జీలకర్ర - 1/4 tsp

ఆవాలు - 1/4 tsp

వేరుశెనగ - 1 టేబుల్ స్పూన్

కాయధాన్యాలు - 1 టేబుల్ స్పూన్

శనిగలు - 1 tsp

జీడిపప్పు - 10

అల్లం-1/2 అంగుళం

ఎర్ర మిర్చి - 3

పచ్చిమిర్చి - 3

కరివేపాకు - 1 టేబుల్ స్పూన్

నీరు - 1/2 కప్పు

వంట నునె

రుచికి ఉప్పు

కొబ్బరి రైస్ తయారు చేసే విధానం

ముందుగా కొబ్బరి తురుమును మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బి కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. ఈ పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాత్ర పెట్టి అందులో నూనె వేయాలి.

తర్వాత జీలకర్ర, ఆవాలు, కాయధాన్యాలు, శెనగలు, వేరుశెనగలు వేసి వేయించాలి.

2 నిమిషాల తర్వాత జీడిపప్పు వేసి అల్లం, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. దీనికి కొంచెం కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తురిమిన కొబ్బరి పాలు వేసి కలపాలి.

ఒక నిమిషం అలాగే ఉంచి అందులో అన్నం వేసి బాగా కలపాలి. అన్నం వేసిన వెంటనే స్టౌ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం కలపాలి. మీకు నచ్చే రుచిగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయినట్టే.