Carrot Lemon Rice : క్యారెట్ లెమన్ రైస్ తయారు చేయడం ఎలా?
Carrot Lemon Rice : బ్రేక్ ఫాస్ట్ ఒక్కోరోజు ఒక్కోలా చేస్తే బాగుంటుంది. అందులో భాగంగా కొత్తగా క్యారెట్ లెమన్ రైస్ ట్రై చేయండి.
ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. అప్పుడే రోజుంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు.. ఎప్పుడూ ఒకేలాగా బ్రేక్ ఫాస్ట్ తింటే.. ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఆరోగ్యకరమైన క్యారెట్ లెమన్ రైస్ చేసేయండి. చేయడం చాలా ఈజీ. దీనిని లంచ్ బాక్స్ కోసం కూడా తీసుకెళ్లొచ్చు. పెద్దగా టైమ్ పట్టదు. దాదాపు లెమన్ రైస్ చేయడం అందరికీ తెలుసు. అందులో క్యారెట్ తురుము వేసుకుంటే చాలు.. రుచికరమైన లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. దీనిని సింపుల్‌గా కింది విధంగా చేయండి.

క్యారెట్ లెమన్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 1 కప్పు, నిమ్మరసం - 1/4 కప్పు, పచ్చిమిర్చి - 5 (తరిగిన), క్యారెట్ - 1 (తురుము), మిరపకాయలు - 2, కొత్తిమీర - కొద్దిగా, ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి - 1 1 / 2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మినపప్పు - 1 1/2 టేబుల్ స్పూన్, శనిగలు - 1 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ పొడి - 1 చిటికెడు, వేయించిన వేరుశెనగ - 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1. ముందుగా బాస్మతీ బియ్యాన్ని కడిగి కుక్కర్‌లో వేసి 1 కప్పు నీళ్ళు, చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి పోసి కుక్కర్ మూతపెట్టి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
3. విజిల్ రాగానే కుక్కర్ తెరిచి ఒక ప్లేటులో అన్నం పెట్టి చల్లారనివ్వాలి.
4. తర్వాత బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, ఉల్లి, శెనగపప్పు, జీడిపప్పు, శనగపప్పు, ఇంగువ పొడి వేసి తాలింపు వేయాలి.
5. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం వేయించాలి.
6. ఇప్పుడు అందులోనే తురిమిన క్యారెట్ వేసి 1 నిమిషం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుతూ, నిమ్మరసం పిండుకోవాలి.
7. అనంతరం వేయించిన పదార్థాలను అన్నంలో వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లితే రుచికరమైన క్యారెట్ లెమన్ రైస్ రెడీ. లొట్టలేసుకుంటూ తినేయడమే.