Cabbage Pachadi : క్యాబేజీ పచ్చడి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు.. మళ్లీ కావాలంటారు-how to prepare cabbage pachadi in telugu step by step method ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Pachadi : క్యాబేజీ పచ్చడి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు.. మళ్లీ కావాలంటారు

Cabbage Pachadi : క్యాబేజీ పచ్చడి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు.. మళ్లీ కావాలంటారు

Anand Sai HT Telugu
Jun 21, 2024 11:32 AM IST

Cabbage Pachadi Recipe In Telugu : క్యాబేజీ పచ్చడి తినేందుకు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మల్లీ మళ్లీ కావాలి అనిపిస్తుంది. ఈ క్యాబేజీ పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుందాం..

క్యాబేజీ పచ్చడి
క్యాబేజీ పచ్చడి

అన్నం కోసం ఎప్పుడూ ఎప్పుడూ కూరలు తింటే బోర్ కొడుతుంది కదా. అన్నంలోకి కాస్త భిన్నంగా ఎప్పుడైనా ట్రై చేశారా? మీ ఇంట్లో క్యాబేజీ ఉంటే కూర వండితే తినేందుకు ఎవరూ ఇష్టం చూపించరు. కానీ దానిని పచ్చడి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు. క్యాబేజీ పచ్చడి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టదు. ఈజీగా చేసేయెుచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

క్యాబేజీ పచ్చడి చేసిన తర్వాత.. ఇది క్యాబేజీతో చేసినది అని చెబితే ఎవరూ నమ్మరు. మంచి రుచి వస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు క్యాబేజీ తినేందుకు మారం చేస్తారు. అలాంటివారికి ఈ క్యాబేజీ పచ్చడి కూడా నచ్చుతుంది. దీనిని తయారుచేసే విధానం తెలిసి ఉండాలి అంతే. క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈ రెసిపీ తయారీ విధానం చాలా సింపుల్. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాబేజీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు

క్యాబేజీ – 150 గ్రా, కొబ్బరి - 2 పెద్ద ముక్కలు, ఉప్పు - రుచి ప్రకారం, నూనె - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు - 1/2 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి నాలుగైదు, ఉల్లిపాయ చిన్నది ఒక్కటి, బిర్యానీ ఆకులు రెండు, కరివేపాకు - 1 కట్ట, కారం - 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 1/4 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా..

క్యాబేజీ పచ్చడి తయారీ విధానం

ముందుగా క్యాబేజీని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మంచిది. తర్వాత తరిగిన క్యాబేజీని 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

అదే సమయంలో చింతపండును నీళ్లలో నానబెట్టాలి. తర్వాత ఓవెన్‌లో బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడి అయ్యాక కరివేపాకు, పప్పు వేసి కరకరలాడే వరకు వేయించాలి.

తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కావాలి అనుకుంటే బిర్యానీ ఆకులను వేసి బాగా వేయించాలి.

ఇప్పడు అందులో జీలకర్ర వేసి కొద్దిగా వేయించి ప్లేటులో పెట్టి చల్లారనివ్వాలి.

తర్వాత బాణలిలో మిగిలిన నూనెలో ఉడకబెట్టిన క్యాబేజీని వేసి 5 నిమిషాలు వేయించి చల్లారనివ్వాలి. ఇలా వేగితే క్యాబేజీ వాసన పోతుంది.

ఆ తర్వాత మిక్సీ జార్‌లో వేయించిన పదార్థాలను వేసి నానబెట్టిన చింతపండు రసం, తురిమిన కొబ్బరిని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. నీరు కలపవద్దు.

తర్వాత క్యాబేజీని వేసి నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.

చివరగా ఓవెన్‌లో బాణలి పెట్టి, అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, కట్ చేసిన ఉల్లి, కరివేపాకు, జీలకర్ర వేయాలి. వేడయ్యాక అందులో కాస్త పసుపు వేసి రుబ్బిన పచ్చడి వేసుకుని కలపాలి. అంతే రుచికరమైన క్యాబేజీ పచ్చడి సిద్ధం.

Whats_app_banner