రోజూ ఉదయం అల్పాహారం చేయడం చాలా పెద్ద టాస్క్. అయితే ఇంట్లో వాళ్లకు ఎప్పుడూ ఒకేలా చేస్తే విసుగు వస్తుంది. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. అందుకోసం మీరు దోసెను రకరకాలుగా చేసుకోవచ్చు. దోసెలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి మజ్జిగ దోసె. ఇది కచ్చితంగా మీకు కొత్తరకమైన రుచిని ఇస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయవచ్చు. మంచి రుచిని ఇస్తుంది.
దోసెలో ఎన్ని రకాల దోసెలు చూశారు? స్పెషల్ దోసె రెసిపీలు చాలానే ఉన్నాయి. దోసెలో కొత్త రుచిని చూడాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణంగా మనం ఇంట్లో బియ్యం పిండితో దోసె చేస్తాం. కొన్ని రకాల దోసెలతో ప్రయోగాలు చేస్తాం.. ఇక బయటకు వెళ్తే.. హోటళ్లలో చాలా రకాల దోసెలు దొరుకుతాయి.
మసాలా దోసె కాకుండా, ప్లేన్ దోసె కాకుండా అనేక నోరూరించే దోసెలు ఉన్నాయి. వెన్న దోస, ఉల్లిపాయ దోసె, రవ్వ దోసె మొదలైనవి. అయితే మీరు ఎప్పుడైనా మజ్జిగ దోసె రుచి చూశారా? ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు ఈ పేరు కొత్తగా విని ఉండవచ్చు. అయితే మజ్జిగ దోసె అనే వంటకం ఉంది. ఇది రుచికరమైన, మృదువైన దోసె. మీరు అల్పాహారం తయారు చేయాలనుకుంటే చేయెుచ్చు.
మీరు దోసెలో వెరైటీగా ప్రయత్నించాలనుకుంటే ఈ దోసె మీ కోసమే. అయితే మజ్జిగ దోసెను ఎలా తయారు చేయాలి? దీన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరం? తెలుసుకుందాం.
బియ్యం - 1 గిన్నె, మెంతులు - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - 1/2 స్పూన్, మజ్జిగ - 1/2 లీటర్, నూనె కొద్దిగా
మెుదట బియ్యాన్ని కడగాలి. నీటి నుండి తీసివేయండి. కొద్దిగా మెంతులను కడిగి బియ్యంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మజ్జిగలో నానబెట్టండి. దీన్ని దాదాపు 8 నుంచి 9 గంటల పాటు మజ్జిగలో నానబెట్టాలి.
తర్వాత బయటకు తీసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని బాగా కలపాలి. అదే రోజు మజ్జిగ ఉపయోగించండి. తర్వాత దీన్ని కూడా ఒకరోజు అలాగే ఉంచాలి.
ఒక రోజు తర్వాత చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడయ్యాక ఈ పిండిని పాన్ మధ్యలో వేయాలి. దోసెలా చేసుకోవాలి. రెండు వైపులా కాల్చండి. మీరు నూనెకు బదులుగా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. రుచి పెరుగుతుంది.
ఈ దోసెను ఏ చట్నీతోనైనా తినవచ్చు. ఇది చాలా మృదువైనది ఉంటుంది. తింటుంటే ఇంకా కావాలి అనిపిస్తుంది. అందరికీ నచ్చుతుంది. ఈ దోసెను వెంటనే తయారు చేయలేం, ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉండాలి. మజ్జిగ అందుబాటులో లేకపోతే పెరుగు కూడా ఉపయోగించవచ్చు. మజ్జిగ అయితే బాగుంటుంది.